ఏం చెప్పావ్‌ చైతన్య.. అదుర్శ్‌..

Update: 2015-09-20 16:55 GMT
''తమ్ముడు చిన్నప్పుడే పాకుతూ హిట్టు ఇచ్చాడు.. 30 సెకండ్ల వాక్‌ తో మొన్న మనం సినిమాతో ఒక హిట్‌ ఇచ్చాడు. ఇప్పుడు అఖిల్‌ సినిమాతో అందరూ ఫస్టు సినిమాకు తెలుగు ఇండస్ట్రీలో అందరూ మొదటి సినిమాకు ఏం చేయలేకపోయారు అన్నీ చేసి చూపిస్తునా్నడు. అసలు టీజర్ లలోనే అన్నీ చూపించేస్తుంటే ఇక సినిమాలో ఎంతుందో.. ఇకపోతే సిసింద్రీ, మనం తరువాత ఇక మనోడు హ్యాట్రిక్‌ హిట్టు కొడతాడు'' అంటూ తన తమ్ముడిని మెచ్చుకున్నాడు  అన్నయ్య నాగ చైతన్య.

మనం ముందే చెప్పినట్లు.. అక్కినేని హీరోలు అందరూ అఖిల్‌ కోసం బాగా ఎక్సయిట్‌ అయ్యారు. అయితే తెలుగు ఇండస్ర్టీలో ఒక అన్నయ్య తన తమ్ముడి కోసం ఎంతో ఎనర్జటిక్‌ గా చెప్పడం అదిరిపోయింది. బాహుశా ఈ స్పీచ్‌ చూశాక.. చైతన్య-అఖిల్‌ కాంబినేషన్‌ లో ఒక సినిమా వస్తే బాగుండు అనిపిస్తోంది.  ఇకపోతే.. లైలా దొరికిందా చెయ్‌? అని అడిగితే..  ''వచ్చే లైలాలు అన్నీ అఖిల్‌ తీసుకెళ్ళిపోతున్నాడు.. ఆ జనరేషన్‌ లైలాలు అన్నీ నాన్న దగ్గరున్నాయ్‌. మధ్యలో నన్నేం చేయమంటారు'' అన్నాడు చెయ్‌. ''అన్నీ అబద్దాలే..'' అని నవ్వేసింది పక్కనే ఉన్న యాంకర్‌ సుమ.
Tags:    

Similar News