తాత.. తండ్రి.. ఇప్పుడు చైతూ!

Update: 2022-07-18 14:30 GMT
అక్కినేని ఫ్యామిలీ హీరోలు అయిన నాగేశ్వరరావు మరియు నాగార్జున లు ద్విపాత్రాభినయం తో మెప్పించారు. తండ్రి కొడుకుల పాత్రల్లో నటించి మెప్పించిన వారు పలు సక్సెస్ లను దక్కించుకున్నారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా లో నాగార్జున తండ్రి కొడుకు పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇప్పుడు నాగ చైతన్య కూడా తండ్రి.. కొడుకు గా ఒకే సినిమా లో కనిపించబోతున్నాడు.

నాగ చైతన్య ఇప్పటి వరకు పలు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. కాని మొదటి సారి తండ్రి కొడుకు గా నాగ చైతన్య కనిపించబోతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా లో నాగ చైతన్య ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. తండ్రి కొడుకు గా నాగ చైతన్య కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

గీత గోవిందం సినిమా విడుదల అయిన వెంటనే నాగ చైతన్య తో పరశురామ్‌ సినిమా కు ఓకే చెప్పించాడు. అధికారికంగా ప్రకటన వచ్చిన నేపథ్యంలో వెంటనే షూటింగ్ మొదలు పెట్టాలని భావించారు.

కాని అనూహ్యంగా మహేష్‌ బాబు నుండి పరశురామ్‌ కు పిలుపు రావడంతో సర్కారు వారి పాట సినిమా కోసం పరశురామ్‌ వెళ్లడంతో చైతూ సినిమా ఆలస్యం అయ్యింది.

సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ సమయంలో తన తదుపరి సినిమా నాగ చైతన్య తో అంటూ అధికారికంగా దర్శకుడు పరశురామ్‌ క్లారిటీ ఇచ్చిన విషయం తెల్సిందే. నాగ చైతన్య మరియు పరశురామ్‌ కాంబోకు సంబంధించిన సినిమా స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా ఫైనల్‌ అయ్యిందని.. అతి త్వరలోనే సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాత మరియు తండ్రి దారిలోనే నాగ చైతన్య ద్విపాత్రాభినయం కు సిద్ధం అయిన నేపథ్యంలో అక్కినేని అభిమానులు ఫుల్‌ జోష్ లో ఉన్నారు. సర్కారు వారి పాట సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. మరో వైపు నాగ చైతన్య నటించిన థాంక్యూ మరియు లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలు విడుదల కాబోతున్నాయి.
Tags:    

Similar News