యంగ్ హీరో నాగచైతన్యకు ఈ ఏడాది ప్రారంభం నుంచే కలిసి రావడం లేదు. జనవరిలో విడుదల కావాల్సిన RRR, రాధేశ్యామ్ సినిమాలు థియేటర్లు పూర్తి స్థాయిలో దేశ వ్యాప్తంగా రీఓపెన్ కాకపోవడం.. థర్డ్ వేవ్ ప్రకంపణల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఈ సమయాన్ని వాడుకోవాలని హడావిడిగా `బంగార్రాజు` మూవీతో బరిలోకి దిగాడు. `మనం` తరువాత ఫాదర్ అక్కినేని నాగార్జునతో కలిసి చైతూ చేసిన ఈ మూవీని `సోగ్గాడే చిన్నినాయన`కు సీక్వెల్ గా తెరకెక్కించారు.
అయితే ఆ స్థాయిలో ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీని తరువాత వచ్చిన రెండు సినిమాలు ఈ మూవీ స్థాయిని కూడా అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోయాయి.
`మనం` వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన విక్రమ్ కె. కుమార్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుల కలయికలో చై చేసిన `థాంక్యూ` తీవ్రంగా నిరాశ పరిచింది. ఏపీలోని పలు ఏరియాల్లోని థియేటర్లలో ఈ సినిమా కోసం ప్రేక్షకులకు డిస్కౌంట్ లు పెట్టాల్సి వచ్చిందంటే సినిమా పరిస్థితి ఏ స్థాయిలో డిజాస్టర్‌గా నిలిచిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఇదే ఏడాది బాలీవుడ్ కు పరిచయం అయిన `అల్ సింగ్ చడ్డా` పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ కి సూపర్ స్టార్ గా పేరున్న అమీర్ ఖాన్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఇలా ఈ ఇయర్ ప్రారంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఎదురవుతుండటంతో నాగచైతన్య కన్ఫ్యూజన్ కు గురవుతున్నాడట. అంగీకరించిన ప్రాజెక్ట్ లని ముందుకు తీసుకెళ్లాలా? అని ఏదీ సరిగ్గా తేల్చుకోలేక పోతున్నాడట.
ప్రస్తుతం విక్రమ్ కుమార్ తో `ధూత` వెబ్ సిరీస్ చేస్తున్న నాగ చైతన్య దీనితో పాటు తమిళ దర్శకుడు విక్రమ్ ప్రభుతో ఓ బైలింగ్వల్ చేయబోతున్నాడు. దీని తరువాత కూడా వరుసగా సినిమాలు చేయాలని పరశురామ్, తరుణ్ భాస్కర్, నందినిరెడ్డి, బొమ్మరిల్లు భాస్కర్ లతో చర్చలు జరుపుతున్నాడట. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం వీరందరితో చర్చలని హోల్డ్ లో పెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
చైతూ తాజా నిర్ణయం పరశురామ్, తరుణ్ భాస్కర్, నందినిరెడ్డి, బొమ్మరిల్లు భాస్కర్ లకు బిగ్ షాకే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. వెంకట్ ప్రభు మూవీ వచ్చే నెట నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇది పూర్తయిన తరువాతే మిగత ప్రాజెక్ట్ ల గురించి ఆలోచించాలని భావిస్తున్నాడట. ఇందులో నాగచైతన్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.