శేఖర్ కమ్ముల అభిమానులతో పాటు అక్కినేని ఫ్యాన్స్ సాయి పల్లవి ఫ్యాన్స్ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న లవ్ స్టోరీ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. గత ఏడాది ఆరంభం నుండి ఇప్పటి వరకు సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. కరోనా కారణంగా చాలా ఆలస్యం అయిన సినిమా వినాయక చవితికి ఖచ్చితంగా వస్తుందని అంతా భావించారు. కాని కరోనా భయం ఇంకా నిర్మాతలను వెంటాడి విడుదల కాకుండా చేసింది. ఎట్టకేలకు వచ్చే వారంలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా షురూ అయ్యాయి. ఈసారి విడుదల తేదీ విషయంలో మేకర్స్ చాలా పక్కాగా ఉన్నారు. నమ్మకంతో విడుదల చేస్తామని చెప్తున్నారు. దానికి తోడు హీరో నాగచైతన్య కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టాడు.
చైతూ వస్తాడా రాడా అనుకుంటున్న సమయంలో వరుసగా ఇంటర్వ్యూలతో చైతూ బిజీ అయ్యాడు. సెలెక్టెడ్ మీడియాకు చైతూ ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటున్నాడు. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ తెలంగాణ యాస మాట్లాడే విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాను. సాదారణంగానే అనిపించినా కూడా యాస పలికే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. మాట్లాడిన సమయంలో యాసతో మాట్లాడినట్లుగా అనిపించినా ఆ తర్వాత వింటే మాత్రం యాస అనిపించేది కాదు. అందుకే డబ్బింగ్ సమయంలో కాస్త ఎక్కువగానే రిస్క్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. షూటింగ్ సమయంలోనే తెలంగాణ యాస లో మాట్లాడేందుకు చాలా ప్రయత్నించాను అంటూ చెప్పుకొచ్చాడు.
శేఖర్ కమ్ముల గారి సినిమా షూటింగ్ అంటే ప్రతి రోజు ఫిల్మ్ స్కూల్ కు వెళ్లినట్లుగా ఉండేది. ప్రతి రోజు ఏదో ఒక విషయాన్ని కొత్తగా నేర్చుకోవడం జరుగుతుంది. శేఖర్ కమ్ముల గారు ఫిల్మ్ మేకింగ్ విషయంలో చాలా లోతుగా ఆలోచిస్తారు. ఆయన ప్రతి సన్నివేశాన్ని కూడా ముందుగా విజువల్ అవుతారు. తాను చేస్తున్న తీస్తున్న సన్నివేశాల విషయంలో ఆయనకు పూర్తి క్లారిటీ ఉంటుందని చైతూ చెప్పుకొచ్చాడు. ఇక సాయి పల్లవి డాన్స్ విషయంలో కూడా నాగచైతన్య ప్రశంసలు కురిపించాడు. ఆమెతో డాన్స్ చేస్తున్న సమయంలో చాలా హెల్ప్ చేసేది. డాన్స్ లో సాయి పల్లవి ది బెస్ట్ అంటూ చైతూ కితాబిచ్చాడు.