శైలజారెడ్డి అల్లుడుతో మిశ్రమ ఫలితాన్ని అందుకున్న హీరో నాగ చైతన్య ఇప్పుడు తన ఫోకస్ మొత్తం రానున్న సవ్యసాచి మీదే ఉంచుతున్నాడు. తన కెరీర్ లోనే చాలా స్పెషల్ ఫిలింగా భావిస్తున్న చైతు ముందు నుంచి దీని మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నిజానికి సిజి వర్క్ లో రాజీ పడుంటే సవ్యసాచినే ముందు వచ్చేది. కానీ కంటెంట్ మీద నమ్మకంతో దర్శకుడు చందు మొండేటికి నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ పూర్తి సహకారం అందించడంతో ఆలస్యం తప్పలేదు. ఇటీవలే ఘట్కేసర్ లో ఉన్న గీతం కాలేజీలో చివరి పాట షూటింగ్ పూర్తి చేసిన టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం బిజీగా ఉంది. నిన్నటి నుంచి కొన్ని మీడియాల్లో దీని విడుదల వాయిదా పడొచ్చేమో అనే వార్తలు విన్పిస్తున్న నేపథ్యంలో యూనిట్ నుంచి పక్కా సమాచారం అందింది. ముందు ప్రకటించిన సవ్యసాచి విడుదల తేదీ నవంబర్ 2లో ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. దానికి అనుగుణంగానే ప్రమోషన్ ప్లానింగ్ తో పాటు బిజినెస్ లావాదేవీలు కూడా చేసేస్తున్నారు. సో చైతు లేట్ అయ్యే ఛాన్స్ లేనట్టే. అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో వస్తుంది.
ఇలా ప్రచారం కావడానికి కారణం లేకపోలేదు. మైత్రినే నిర్మిస్తున్న మరో మూవీ రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ రిలీజ్ అక్టోబర్ 5 నుంచి వాయిదా వేయక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. సవ్యసాచి స్థానంలో దీన్ని పంపించి చైతు మూవీని డిసెంబర్ కు పోస్ట్ పోన్ చేయచ్చని వాటిలో ప్రచారం చేసారు. కానీ అవేవి నిజం కాదు. ఒకవేళ అమర్ అక్బర్ ఆంటోనీని సైతం నవంబర్ లో విడుదల చేయాలి అనుకున్నా రెండు లేదా మూడో వారాన్ని ఆప్షన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఒక చేయి తన ఆధీనంలో ఉండని ఓ వినూత్నమైన పాత్ర చైతు చేస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. చాలా ఏళ్ళ తర్వాత తమిళ నటుడు మాధవన్ దీని ద్వారానే తెలుగు స్ట్రెయిట్ మూవీ ద్వారా కం బ్యాక్ చేస్తున్నాడు. భూమిక మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. రేసీ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకునే చందు మొండేటి టేకింగ్ గురించి చైతుకే కాదు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. సో సవ్యసాచి నవంబర్ 2 వచ్చే విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. టీజర్ దసరాకు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.