కుర్ర హీరోకి ప్రేమ కథలు చేసి చేసీ బోర్ కొట్టిందట

Update: 2020-01-29 07:20 GMT
ఒకటే పని రోజూ చేయాలంటే చిరాకు. కానీ.. బతుకు బండి కోసం చాలామంది అలా చేస్తుంటారు. కొందరికి అలాంటి పరిస్థితే ఉండదు. ప్రతి రోజూ సరి కొత్త గా ఉండటమే కాదు.. రోజు.. రోజుకి ఎక్సైట్ మెంట్ పెరిగే ప్రొఫిషన్స్ కొన్ని ఉంటాయి. ఆ కోవకే చెందింది సినిమా ఇండస్ట్రీ. ఇందులో అవకాశం రావటమే గొప్ప అయితే.. పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకోవటం.. ప్రజల్లో క్రేజ్ సంపాదించుకోవటం మాటలు కాదు.

అన్ని ఉన్నా.. కొన్నిసార్లు కొన్ని కొరతలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటిదే కుర్రహీరో నాగశౌర్యకు ఎదురవుతోందట. ఒకే జోనర్ లో సినిమాలు చేసి.. చేసి బోర్ కొట్టిందట. ప్రేమకథల సినిమాలతో తల వాచిపోయిందంటున్నాడు. రోజూ పువ్వు పట్టుకోవటం..ఐ లవ్యూ చెప్పటం.. అమ్మాయిల వెంట పడటం..కాదంటే ఒక విషాద గీతం వేసుకోవటం లాంటివి ఎన్ని రోజులని చేస్తాం చెప్పండని ప్రశ్నిస్తున్నాడు.

రోజూ షూటింగ్ కు వెళుతున్నా.. ఉత్సాహం లేకుండా పోతోందట. నాగశౌర్య అన్ని చేయగలడని ఫ్రూవ్ చేయించుకోవాలన్నదే తన లక్ష్యంగా చెబుతున్నారు. అందుకోసమే తన తాజా అశ్వథ్థామ సినిమా చేశానని.. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో చేస్తున్న సినిమా కూడా మస్తు ఎక్సైటింగ్ గా ఉందంటున్నాడు. ఎందుకంటే.. ఆ మూవీ లో తన పాత్ర లో మొత్తం ఏడు షేడ్స్ ఉంటాయని.. ఇది చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పుకొచ్చాడు. పోన్లే.. బోర్ కొట్టిన నాగశౌర్యకు ఛాలెంజింగ్ పాత్రలు వస్తున్నాయన్నమాట.


Tags:    

Similar News