ఛలో పోలికతో చిక్కే

Update: 2018-08-26 01:30 GMT
నాగ శౌర్య @నర్తనశాల 30న విడుదలకు సర్వం సిద్ధం చేసుకుంది. పెద్ద పోటీగా ఉంటుంది అనుకున్న శైలజారెడ్డి అల్లుడు అనూహ్యంగా బరిలో నుంచి తప్పుకోవడంతో ఐరా టీమ్ ఆనందం మామూలుగా లేదు. ఖచ్చితంగా అది ఎడ్వాంటేజ్ గా మారుతుంది. ఓపెనింగ్స్ పరంగా కూడా సానుకూలంగా ఉంటుంది. దాని ప్లేస్ లో పేపర్ బాయ్ వస్తున్నా నాగ శౌర్యకున్న ఇమేజ్ ప్లస్ మార్కెట్ నర్తనశాలకు హెల్ప్ అవుతున్నాయి. కాకపొతే ఛలోతో పోలిక రావడమే కాస్త చిక్కులో పెడుతోంది. ఛలో విడుదలకు ముందే మ్యూజికల్ గా కూడా మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా చూసి చూడంగానే పాట యూత్ కు పిచ్చ పిచ్చగా కనెక్ట్ అయిపోయి రోజుల్లోనే మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. ఇప్పుడు @నర్తనశాలలో ఎగిరేనే మనసు లాంటి పాటలు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నా ఛలోతో పోలిక రావడం సహజంగానే ఇబ్బంది కలిగించేదే. యూనిట్ కూడా పదే పదే ఛలోని మించిన వినోదం ఉంటుందని చెప్పుకోవడం వద్దన్నా పోలిక తెస్తోంది.

నిజానికి ఒక హీరో సంగీత దర్శకుడి కాంబో రిపీట్ అయినప్పుడు ఇలాంటి విశ్లేషణలు సహజంగానే జరుగుతాయి. ఇళయరాజా మణిశర్మ కీరవాణి లాంటి దిగ్గజాలు సైతం ఎవరైనా హీరోతో పెద్ద మ్యూజికల్ హిట్ కొట్టినప్పుడు అదే రేంజ్ అవుట్ ఫుట్ ఆ తర్వాత సినిమాకు ఇవ్వలేకపోయి ఉండవచ్చు. అంత మాత్రాన మిగిలినవి ఆడలేదని కాదు హిట్ కాకుండా పోయినవి కాదు. ఇక్కడ కూడా అదే తీరు కనిపిస్తోంది. చూసి చూడంగానే పాటను మించి ఆశిస్తేనే చిన్న అసంతృప్తిగా అనిపించవచ్చేమో కానీ విడిగా వింటూ ఆస్వాదిస్తే నాగ శౌర్య చెప్పినట్టు మహతి  స్వర సాగర్ ఛలోకు మించి @నర్తనశాలకు కష్టపడిన విషయం అర్థమవుతుంది. వీటికి చెక్ పడాలి అంటే 30 దాకా వేచి చూడాల్సిందే. ఇప్పటికే పబ్లిసిటీ పరంగా మంచి ఎడ్జ్ తెచ్చుకుని పబ్లిక్ లోకి వెళ్ళిపోయిన @నర్తనశాల ట్రైలర్ లో చూపించినట్టు వినోదం పాళ్ళు పూర్తిగా అందించగలిగితే మరో సక్సెస్ ఖాతాలో పడినట్టే.
Tags:    

Similar News