కుర్ర హీరో చెప్పిన కుర్చీల లెక్క

Update: 2018-01-26 04:22 GMT
నిన్న జరిగిన ఛలో ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి రాకతో నిండుతనాన్ని సంతరించుకుంది. నాగ శౌర్యకున్న మార్కెట్ దృష్ట్యా ఇప్పుడిప్పుడే హైప్ తెచ్చుకుంటున్న ఈ మూవీకి నిన్న జరిగిన వేడుక ప్లస్ గా మారనుంది. ఇక చిరంజీవి రావడాన్ని తాను ఎంత ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాడో మాటల్లో బయటపడిపోయాడు నాగ శౌర్య. సినిమా గురించి కంటే చిరు గురించే ఎక్కువ ఉద్వేగానికి లోను కావడం దానికి కారణంగా చెప్పొచ్చు. ఈ సందర్భంగా శౌర్య చెప్పిన కుర్చీల కథ మెగా ఫాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. చిరంజీవి పదేళ్ళ కంటే ముందు సినిమాలు చేస్తున్నప్పుడు ఒకటి నుంచి నాలుగు వరకు కుర్చీలుండేవని, ఆయన వెళ్ళిపోయాక కుర్చీలు పోయి అందరు నిలుచున్నారని, ఇప్పుడు తిరిగి వచ్చాక మళ్ళి నెంబర్ వన్ కుర్చీ ఆయనే తెచ్చుకుని కూర్చున్నారని చెప్పి ఫాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చేసాడు నాగ శౌర్య.

చిరంజీవి గెస్ట్ గా రావడం మానేసాక సినిమా ఫంక్షన్లు హోటల్స్ లో చేసుకుంటూ రిసెప్షన్ల లాగా మార్చేశారని, ఇప్పుడు మళ్ళి సినిమాల్లోకి వచ్చారు కాబట్టి ఆ గోల్డెన్ డేస్ తిరిగి చూడబోతున్నాం అని చెప్పిన శౌర్య స్పీచ్ మొదట్లో సైరా మెగాస్టార్ అని కేకలు పెడుతున్న అభిమానులను దయచేసి క్షమించండి, నేను మాట్లాడాలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయటం అందరిని ఆకర్షించింది. చిరు స్టేజి మీదకు వచ్చినప్పుడు ఒక్కసారిగా అభిమానుల తాకిడి పైకి వచ్చేయడంతో బౌన్సర్లు వారిని అడ్డుకోబోతే చిరు సర్దిచెప్పి అందరిని కిందకు పంపించేసారు.

ఛలో ఫిబ్రవరి 2 న విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ ప్రమోషన్ చాలా కీలకంగా మారింది యూనిట్ కు. రవితేజ టచ్ చేసి చూడు తో పోటీ ఉండటంతో దానికి ధీటుగా నిలవాలి అంటే ఛలో కంటెంట్ లో చాలా మ్యాటర్ ఉండాలి. ట్రైలర్ - మ్యూజిక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న నేపధ్యంలో విజయం పట్ల శౌర్య ధీమాగా ఉన్నాడు. ఛలో అతని ఫ్యామిలీ మూవీ. అతని అన్నయ్య యుఎస్ నుంచి వచ్చేసి తన తల్లి తల్లితండ్రులతో స్వయంగా కలిసి నిర్మించిన మూవీ ఛలో. దర్శకుడు వెంకీ కుడుములకు డెబ్యు మూవీ.
Tags:    

Similar News