ఛలోతో సక్సెస్ అందుకుని మాంచి హుషారు మీదున్న కుర్ర హీరో నాగ శౌర్య తన కొత్త సినిమా కోసం కసరత్తు మొదలు పెట్టాడు. స్వీయ నిర్మాణంలో రిస్క్ చేసి తీసిన ఛలో భారీ సినిమాల పోటీ మధ్య విజయం సాధించడం అతనికి బాగా కిక్ ఇస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు నాగ శౌర్య తన నెక్స్ట్ మూవీ వై.కాశి విశ్వనాథ్ దర్శకత్వంలో చేయనున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్న కాశి విశ్వనాధ్ 15 ఏళ్ళ తర్వాత దర్శకత్వం వహించబోతున్నాడు. దీనికి పేరేంటో తెలుసా. గురువారం మార్చ్ ఒకటి. దూకుడు సినిమాలో తమన్ స్వరపరిచిన ఈ పాట మహేష్ బాబు కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మెలోడీగా మిగిలిపోయింది. ఇప్పుడు ఇదే పేరుని తమ కాంబోలో వచ్చే మూవీకి ఫిక్స్ అయ్యారని టాక్.
యాక్టర్ గా బిజీగా మారాక దర్శకత్వానికి స్వస్తి పలికిన కాశి విశ్వనాధ్ మొదటి సినిమా నువు లేక నేను లేను. తరుణ్, ఆర్తి అగర్వాల్ జంటగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మాణమైన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. మ్యూజికల్ గా ఆర్పి పట్నాయక్ స్వరకల్పనలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా రామోజీ రావు నిర్మించిన తొలిచూపులోనే సినిమాకు దర్శకత్వం వహించిన కాశి విశ్వనాధ్ అది ఫ్లాప్ అయ్యాక నటుడిగా కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టి అందులోనే కొనసాగుతూ ఉన్నారు.
మరి ఇన్నాళ్ళకు నాగ శౌర్య లాంటి అప్ కమింగ్ యూత్ హీరోని ఒప్పించారు అంటే కథలో విషయం ఉండే ఉంటుంది. వందకు పైగా సినిమాల్లో నటనానుభవం ఉన్న కాశి విశ్వనాధ్ విజయనిర్మల గారి దగ్గర లంకెబిందెలు సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి సురేష్ సంస్థ నిర్మించిన ఎన్నో సినిమాలలో అదే శాఖలో పనిచేసి ఆ బ్యానర్ లోనే దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. మరో దర్శకుడు శ్రీవాస్ ఈయనకు కజిన్.