ప్రీ లుక్ తో అదరగొట్టిన శౌర్య...!

Update: 2020-07-25 07:30 GMT
టాలీవుడ్ లో చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న యువ హీరో నాగ శౌర్య ఇప్పుడు లుక్ మార్చేశాడు. తన కెరీర్లో 20వ చిత్రంగా రాబోతున్న సినిమా కోసం శౌర్య వర్కౌట్స్ చేసి తన కటౌట్ మార్చేశాడు. ఇప్పటికే ఇంట్లోనే జిమ్ ని చేసుకొని కఠోర వ్యాయామాలు చేస్తున్న నాగ శౌర్య కండలు తిరిగిన దేహాన్ని చూసి ఇప్పుడు అందరూ వావ్ అంటున్నారు. ''ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు'' అంటూ ఈ చిత్రంలో నాగ శౌర్యకి సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'సుబ్రహ్మణ్యపురం' డైరెక్టర్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కాలభైరవ సంగీతం సమకూరుస్తుండగా రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ జూలై 27న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటి వరకు లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన నాగశౌర్య మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 'అశ్వద్ధామ' సినిమాలో మంచి ఫిట్నెస్ తో కనిపించిన శౌర్య నెక్స్ట్ సినిమా కోసం మరింత కష్టపడి బాడీ బిల్డ్ చేసాడని తెలుస్తోంది. కాగా లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు నాగశౌర్య. ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. అలానే 'ఊహలు గుసగుసలాడే' ఫేమ్ అవ‌స‌రాల శ్రీనివాస్ డైరెక్ష‌న్ లో పీపుల్స్ మీడియా వారితో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. 
Tags:    

Similar News