నందమూరి బాలకృష్ణను టార్గెట్ చేస్తూ మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా ద్వారా ఇస్తున్న కౌంటర్లు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇప్పటివరకూ ఫోటోలతో కామెంట్లతో.. వీడియో మెసేజిలతో సరిపెట్టిన నాగబాబు ఈసారి క్రియేటివిటీని పెంచి మరీ దాడి చేశాడు. బాలయ్య గతంలో ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సరిగ్గా ఆ విషయం పై షార్ట్ ఫిలిం తీసి.. అందులో నటించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాడు.
ఈ షార్ట్ ఫిలిం టైటిల్ 'ఎర్రోడి వీరగాధ'. ఈ షార్ట్ ఫిలిం ను 'నాగబాబు కౌంటర్ తో బాలకృష్ణ - ఎర్రోడి వీరగాధ' అనే టైటిల్ తో పోస్ట్ చేశాడు. "ఈ వీడియోలోని పాత్రలు.. పేర్లు ఎవరినీ ఉద్దేశించినవి కాదు. కల్పితాలు. ఒకవేళ ఎలాంటి పోలిక ఉన్నా అది కో ఇన్సిడెన్స్ మాత్రమే" అంటూ రెగ్యులర్ గా సినిమాకు ముందు వేసే ఒక స్లైడ్ వేశారు. ఇక షార్ట్ ఫిలిం మొదటి సీన్లోనే కొందరు మహిళలు ఒక వ్యక్తిని చావబాదుతూ ఉంటారు. అదే దారిలో కారులో వెళుతున్న నాగబాబు అతన్ని చూసి జాలిపడి "ఒక మగవాడిని అంతమంది ఆడవాళ్ళూ కొడుతున్నారు.. అయినా మనకెందుకులే" అనుకుంటూ వెళ్ళిపోతాడు. మరో చోట కూడా అటువంటి సీన్ కనిపించడంతో కారు దిగి వారిని అడ్డుకుంటాడు.
మహిళలను వెళ్ళమని చెప్పి పంపించి వేస్తాడు. తర్వాత విషయం ఏంటని ఆరా తీస్తే "ఆడ పిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలి...కడుపైనా చేయాలి" అనే పెద్దల మాటను ఫాలో అయితే ఇలా జరిగిందని అతడు చెప్తాడు. దీంతో ఒళ్ళు మండిన నాగబాబు మళ్ళీ అతన్ని మహిళలకు అప్పగిస్తాడు.
"వదల బొమ్మాళి" టైపులో బాలయ్యను టార్గెట్ చేస్తున్న నాగబాబు కు ఇంకా బాలయ్య నుండి కౌంటర్ అయితే ఇంతవరకూ రాలేదు. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి. అంతలోపు ఎర్రోడి వీరగాధను మీరూ తిలకించండి.
Full View