‘జబర్దస్’లో బూతులపై నాగబాబు కామెంట్

Update: 2017-02-06 08:17 GMT
ఈటీవీలో వచ్చే జబర్దస్త్ ప్రోగ్రాం సూపర్ పాపులర్. గురు.. శుక్రవారాలు వచ్చాయంటే కోట్లమంది టీవీలకు అతుక్కుపోతారు. అప్పుడు మిస్సయిన వాళ్లు యూట్యూబ్ లో నచ్చిన ఎపిసోడ్ చూసుకుంటారు. ఐతే బోలెడంత వినోదం పంచే ఈ ప్రోగ్రాంలో బూతులు దొర్లడం గురించే చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. ఓ మోస్తరు స్థాయిలో బూతులుంటే ఓకే కానీ.. కొన్నిసార్లు జబర్దస్త్ కమెడియన్లు శ్రుతి మించి పోతుంటారు. చాలా ఎబ్బెట్టుగా ఉండే బూతు జోకులు పేలుస్తుంటారు. నాగబాబు లాంటి స్టేచర్ ఉన్న వ్యక్తి జడ్జిగా ఉన్న ఈ కార్యక్రమంలో ఇలాంటి బూతులేంటని కొందరు ప్రశ్నిస్తుంటారు.

ఇదే మాట నాగబాబును అడిగితే.. ‘‘కొన్నిసార్లు ఇందులో బూతులు శ్రుతి మించుతాయన్న మాట వాస్తవమే. అది కొందరికి ఇబ్బంది కలిగిస్తుంది. ఐతే స్కిట్ నడుస్తున్నపుడు మధ్యలో దీని గురించి మాట్లాడలేం. అందుకే షూటింగ్ అయ్యాక కమెడియన్ల​ను​ పిలిచి చెబుతుంటా. బూతుల్లేకుండా చూసుకోమని హెచ్చరిస్తుంటా. ఐతే అలా చెప్పినపుడు ఓ రెండు మూడు ఎపిసోడ్ల వరకు బాగానే ఉంటారు. కానీ తర్వాత మళ్లీ మామూలైపోతారు. సాధ్యమైనంత వరకు వాళ్లను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంటా. బూతుల్లేకుండా కూడా జనాలు హాయిగా నవ్వుకునేలా చేయొచ్చు’’ అని నాగబాబు వివరించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News