కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమకూ ఊతమిస్తూ సీఎం జగన్ ఇటీవల కేబినెట్ లో నిర్ణయించిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమకు భారీగా రాయితీలు ఇచ్చారు. థియేటర్లకు రుణాలు ఇస్తామని ప్రకటించారు.ఈ క్రమంలోనే జగన్ పై సీనీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
థియేటర్లు చెల్లించాల్సిన 3 నెలల ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ చార్జీలు రద్దు చేస్తూ ఏపీ మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ చార్జీలు రద్దు చేయనుంది. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుందని తెలిపింది. దీంతో సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా సీఎం వైఎస్ జగన్ కు మెగా బ్రదర్.. జనసేన అధినేత పవన్ అన్నయ్య నాగబాబు ధన్యవాదాలు తెలుపడం రాజకీయంగా ఆసక్తిగా మారింది. ట్వీట్ చేసిన నాగబాబు ‘సీఎం జగన్ నిర్ణయంతో లాక్ డౌన్ కారణంగా ఇండస్ట్రీలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చారని.. ఏపీ సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. ఆపత్కాలంలో పరిశ్రమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు ’ తెలిపారు. ప్రభుత్వం చొరవతో మూవీ ఇండస్ట్రీకి జవసత్వాలు వస్తాయని నాగబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇక చిరంజీవి, రాంచరణ్ కూడా సీఎం జగన్ ఇండస్ట్రీకి కురిపించిన వరాలపై ధన్యవాదాలు తెలిపారు. అయితే నాగబాబు ట్వీట్ పై మాత్రం రచ్చ మొదలైంది.
స్వతహాగా జనసేన నాయకుడు నాగబాబు. జనసేన నుంచి నర్సాపురం ఎంపీగానూ పోటీచేసి ఓడిపోయారు. పవన్ పై ఈగవాలనీయరు. అలాంటిది ప్రత్యర్థి అయిన సీఎం జగన్ కు ధన్యవాదాలు చెప్పినందుకు జనసేన కార్యకర్తలు.. పవన్ ఫ్యాన్స్ ఫీలవుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారట.. పవన్ ను అన్నయ్య నాగబాబు రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధపడుతున్నారు.