ప్రతీసారీ మెగా ఫంక్షన్లు జరగడం.. అక్కడికి పవన్ కళ్యాణ్ రాడు.. అదే విషయం అభిమానులకు కూడా తెలుసు. కాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ తిరిగే అభిమానులు మాత్రం, మెగా ఈవెంట్లకు అటెండ్ అవ్వడం.. అక్కడ అందరి ముందూ పవర్ స్టార్ అని అరవడం.. ఇదే తంతు. ఎన్నేళ్ళని పాపం మెగా హీరోలు, ఫ్యామిలీ సభ్యులూ ఈ విషయంపై సైలెంటుగా ఉంటారు. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మెగా బ్రదర్ నాగబాబు రూపంలో దూసుకొచ్చింది.
''ఇక్కడ మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతీ ఫంక్షన్ కూ మేము పవన్ కళ్యాణ్ ను పిలుస్తాం. కాని ఫ్యామిలీ ఫంక్షన్లకు వాడు రాడు. వాడెందుకు రాడో వాడికే తెలియాలి. మీరు ఇలా ఈవెంట్లలో పవర్ స్టార్ అని అరుస్తూ గోల చేసేబదులు, మీకు దమ్ముంటే వెళ్ళి పవర్ స్టార్ ఆఫీస్ దగ్గర, ఇంటి దగ్గర అరవండి. ఎందుకు రాడో కనుక్కోండి. అంతేకాని ఇక్కడ ఫంక్షన్లను డిస్ర్టబ్ చేయకండి. చాన్నాళ్ళ నుండి చూస్తున్నాం .. ఇక భరించలేం.'' అంటూ నాగబాబు తేల్చి చెప్పేశారు.
అయినా వేరే ఛానళ్ల 20 ఏళ్ళ సంబరాలకు, వేరే యంగ్ హీరోల ఆడియో లాంచ్ లకు కూడా వెళ్ళే పవన్ కళ్యాణ్.. సొంత ఫ్యామిలీ సంబరాలకు ఎందుకు రావట్లేదని నిజంగానే ఆయనకే తెలియాలి. గతంలో ఎన్నోసార్లు మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే పవన్ మాత్రం ఎన్నడూ దీనిపై స్పందించకపోగా.. ఈ మ్యాటర్ పై కనీసం ఇంటర్యూ లు కూడా ఇవ్వట్లేదని మీడియా వర్గాలు చెబుతున్నాయి.