అన్నయ్య ఒకరికి సపోర్ట్.. తమ్ముడు ఇంకొకరికి సపోర్ట్.. అసలేం జరుగుతోంది? మూవీ ఆర్టిస్టుల (మా) సంఘం ఎన్నికలు రసవత్తరమైన పరిణామమిది. ఎవరూ ఎవరినీ నిరాశపరచడం లేదు. ఇండస్ట్రీ పెద్దన్నగా మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఇరు ప్యానెల్స్ కి తన మద్ధతును ప్రకటించారు. శివాజీ రాజా ప్యానెల్, నరేష్ ప్యానెల్ .. ఎవరు గెలిచినా మా బావుండాలని కోరుకుంటున్నాను అంటూ న్యూట్రల్ గా మాట్లాడారు. అయితే ఈసారి కూడా మా అధ్యక్షుడిగా శివాజీ రాజా కొనసాగితేనే బావుంటుందని, ఇప్పటికే ప్రవేశ పెట్టిన పథకాలు అమలవుతాయని చిరు అంతర్గతంగా సూచించారని ఇదివరకూ వార్తలు వచ్చాయి.
ఇదిలా ఉండగానే మెగా బ్రదర్ నాగబాబు నరేష్ ప్యానెల్ ని సపోర్ట్ చేయడం ప్రముఖంగా చర్చకు వచ్చింది. తాజాగా నరేష్ ప్యానెల్ సభ్యులు మెగా బ్రదర్ ని కలిసిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. మూవీ ఆర్టిస్టుల సంఘంలో ఎవరూ ఏడాదికి మించి పదవులు చేపట్టకూడదని, ఫ్రెష్ బ్లడ్ రావాల్సిందేనని నాగబాబు అభిప్రాయపడ్డారు. నా టైమ్ లో నేను ఒక ఏడాది మాత్రమే అధ్యక్షుడిగా కొనసాగాను. మరో సంవత్సరం చేయాల్సిందిగా కోరినా నేను చేయలేదు. కొత్తవారికి అవకాశం ఇవ్వాలి. కొత్త ఆలోచనలు రావాలి. అవకాశం ఇవ్వకుండా.. వెనక్కి తగ్గాలని చెప్పాల్సిన పనేలేదు`` అన్నారు.
``మహిళలలకు కేవలం ఈసీ మెంబర్లుగా అవకాశం ఇస్తే సరిపోదు. ప్రధానమైన రోల్ ఇవ్వాలి. నరేష్ ప్యానెల్ లో జీవితను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసుకోవడం హర్షనీయం. అలాగే హీరో రాజశేఖర్ ఈ ప్యానల్ లో చేరికతో కొత్త ఆలోచనలకు ఆస్కారం ఏర్పడుతోంది. పదవుల్లో మగాళ్ల హవా మాత్రమే సాగడం తగదు`` అని నాగబాబు వ్యాఖ్యానించడం వేడెక్కిస్తోంది. నరేష్ ప్యానెల్ కి మెగా బ్రదర్ మద్ధతు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే మెగా బ్రదర్స్ ఏ ఒక్క వర్గానికో కొమ్ము కాయరు అని నిరూపణ అయినట్టేనా?