‘నాగభరణం’ రివ్యూ
నటీనటులు: రమ్య-దిగంత్-సాయికుమార్-ముకుల్ దేవ్-రవి కాలె-రాజేష్ వివేక్-సాధు కోకిల తదితరులు
సంగీతం: గురుకిరణ్
ఛాయాగ్రహణం: సీహెచ్ వేణు
నిర్మాతలు: సాజిద్ ఖురేషి-సోహైల్ అన్సారి-ధవల్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కోడిరామకృష్ణ
తెలుగులో శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించారు కోడి రామకృష్ణ. తెలుగులో గ్రాఫిక్స్ ప్రధాన చిత్రాలకు శ్రీకారం చుట్టింది.. వాటికి పాపులారిటీ తీసుకొచ్చింది కోడిరామకృష్ణనే. ఆయన తొలిసారి కన్నడలో చేసిన సినిమా ‘నాగరహవు’. దశాబ్దం కిందటే చనిపోయిన కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ ను తిరిగి తెరమీద పున:సృష్టించే ప్రయత్నం చేయడం ద్వారా ఈ సినిమాపై జనాల్లో ఆసక్తి రేకెత్తించారు. దీనికి తోడు గ్రాఫిక్స్ ప్రధానంగా కోడి రామకృష్ణ సినిమాలు చాలా వరకు విజయవంతమైన నేపథ్యంలోనూ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ‘నాగభరణం’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ: నాగ్ చరణ్ (దిగంత్) రాయల్ కోబ్రా పేరుతో మ్యూజిక్ బ్యాండ్ నడుపుతుంటాడు. మానస (రమ్య).. నాగ్ చరణ్ వెంటపడి అతడి ట్రూప్ లో చేరుతుంది. ఐతే ఆమె.. నాగ్ చరణ్ ఇంట్లోకి చేరాక అనూహ్యమైన పరిణామాలు జరుగుతాయి. మానస చిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. మరోవైపు వీళ్ల మ్యూజిక్ బ్యాండ్ ను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తుంటాడు ఒక కార్పొరేట్ సంస్థ యజమాని. అతను నాగ్ చరణ్ ట్రూప్ లోని అతడి స్నేహితులందరినీ చంపించేస్తారు. వాళ్లను చంపిన వాళ్లలో ఒక్కక్కరినే మానస చంపడం మొదలుపెడుతుంది. ఇంతకీ మానస ఎవరు.. ఆమె వెనుక కథ ఏంటి.. ఆమె నాగ్ చరణ్ దగ్గరికి ఎందుకొచ్చింది.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: ‘నాగభరణం’ ప్రమోషన్లో కోడి రామకృష్ణ మాట్లాడుతూ ఒక మాటన్నారు. సినిమా కోసం.. సినిమాలో భాగంగా గ్రాఫిక్స్ ఉండాలి కానీ.. గ్రాఫిక్స్ కోసం సినిమా చేయకూడదు అని. కాకపోతే ఈ సలహా ఇస్తూ.. దాన్ని ఆయనే పాటించలేదు. ‘నాగభరణం’ కేవలం గ్రాఫిక్స్ ఆడంబరం చూపించడానికి చేసిన ప్రయత్నం. కోడి రామకృష్ణ గ్రాఫిక్స్ ప్రధానంగా చేసిన సినిమాల్లో దిగువన నిలుస్తుందీ సినిమా. కథాకథనాల సంగతి వదిలేసి.. గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్టుల మీదే దృష్టి సారించింది కోడిరామకృష్ణ బృందం.
విజువల్ ఎఫెక్ట్స్.. గ్రాఫిక్సే కేవలం వాటి కోసమనే థియేటర్లలోకి వెళ్లం కదా. కథాకథనాలు కూడా బాగుండాలని ఆశిస్తాం కదా. ఇక్కడే నాగభరణం తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ఒక సన్నివేశం ఎలాగో మొదలై.. ఇంకెలాగో ముగుస్తుంది. అసలు ఒక సీన్లోకి ఒక పాత్ర ఎందుకొస్తుందో అర్థం కాదు. ఈ సీన్లో విలన్ ఉండాలి కాబట్టి.. సడెన్ గా ఆ పాత్ర ఊడిపడుతుుంది. మరో సన్నివేశంలో హీరోయిన్ కనిపించాలి కాబట్టి ఆమె ఇంకెక్కడో ప్రత్యక్షమవుతుంది. అటు ఫ్లాష్ బ్యాక్ కానీ.. ఇటు వర్తమానంలో సాగే సన్నివేశాలు కానీ ఆకట్టుకోవు.
ద్వితీయార్ధంలో ఫ్లాష్ బ్యాక్ పేరు చెప్పి.. అరుంధతి సినిమా చూపించారు. రమ్య గెటప్.. ఆ పాత్ర తీరు.. ఈ ఎపిసోడ్లో వచ్చే సన్నివేశాలు.. చివరికి డైలాగులు.. బ్యాగ్రౌండ్ స్కోర్ సైతం ‘అరుంధతి’ని గుర్తుకు తెస్తాయి. ‘మగధీర’లోని పోరాట సన్నివేశాన్ని తలపించేలా ఇందులో ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా పెట్టారు. సాయికుమార్ ప్రెజెన్స్ కూడా ఈ ఎపిసోడ్ ను అసక్తికరంగా మార్చలేకపోయింది.
వీటన్నింటినీ దాటి.. దివంగత నటుడు విష్ణు వర్ధన్ కోసం ఎదురు చూస్తే ఆయన్ని చూపించిన విధానం కూడా నిరాశ పరుస్తుంది.
మామూలుగా ఒక వ్యక్తితో షూటింగ్ కానిచ్చేసి.. తర్వాత అతడి తల తీసి విష్ణువర్ధన్ తల పెట్టారు. ఐతే బాడీకి.. విష్ణువర్ధన్ తలకు పొంతన కుదరక ఈ ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేదు. ఈ సన్నివేశాలు అసహజంగా అనిపిస్తాయి. ఇక పాముకు సంబంధించి గ్రాఫిక్స్ గురించి చెప్పేదేముంది..? 90ల్లోనే కోడి రామకృష్ణ ఇలాంటి గ్రాఫిక్స్ తో సినిమాలు తీశాడు. అక్కడక్కడా కొన్ని విజువల్ ఎఫెక్టులు బాగున్న ఫీలింగ్ కలిగిస్తాయి కానీ.. అంతకుమించి ‘నాగభరణం’ ఆకట్టుకునే అంశాలు ఏ కోశానా కనిపించవు.
నటీనటులు: చాన్నాళ్ల తర్వాత తెరపై కనిపించిన రమ్య.. దర్శకుడు చెప్పినట్లు చేసుకుపోయింది. సన్నివేశాలు తేలిపోవడంతో ఆమె నటన కూడా కామెడీగానే అనిపిస్తుంది. హీరో దిగంత్ చూడ్డానికి బాగున్నాడు. అతను కూడా అతిగా నటించాడు. ఉన్నంతలో సాయికుమార్ మేలు. కానీ ఆయన పాత్ర కూడా ఏమంత గొప్పగా లేదు. ముకుల్ దేవ్.. రవి కాలె.. రాజేష్ వివేక్.. వీళ్లందరూ కూడా అవసరానికి మించే నటించారు.
సాంకేతికవర్గం: గురుకిరణ్ కన్నడలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు. ఐతే నాగభరణంలో ఆయన పాటలు.. నేపథ్య సంగీతం చెవుల తుప్పు వదలగొట్టేస్తాయి. లౌడ్ నెస్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఛాయాగ్రహణం పర్వాలేదు. విజువల్ ఎఫెక్ట్స్.. గ్రాఫిక్స్ విషయంలో చాలా కష్టం.. ఖర్చు ముడిపడినట్లున్నాయి. కొన్ని చోట్ల కష్టం.. ఖర్చు రెండూ కనిపిస్తాయి కానీ.. అవి సినిమాకు ఎంతమాత్రం ఉపకరించాయి అంటే చెప్పడం కష్టం. కోడి రామకృష్ణ ఇంతకుముందు గ్రాఫిక్స్ సినిమాలు తీసినపుడు కథాకథనాల్ని కూడా పట్టించుకునేవారు. కానీ ఈసారి ఎందుకంత తేలిగ్గా తీసుకన్నారో ఏమో. గ్రాఫిక్స్.. వీఎఫెక్స్ తో ముడిపడ్డ కొన్ని సన్నివేశాల్ని బాగానే డీల్ చేశారు కానీ.. మిగతా చోట్ల ఫెయిలయ్యారు. కోడి రామకృష్ణ అభిమానులు ఆయన నుంచి ఆశించే సినిమా కాదిది.
చివరగాః నాగభరణం.. చాలా డేంజర్
రేటింగ్: 1.5/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre