సండే కారు నడుపుతావా చైతూ?

Update: 2017-12-04 18:18 GMT
ఇప్పుడు తెలుగు హీరోల్లో కార్ అనే పేరు చెబితే అందరి దగ్గరా టాప్ రేంజ్ లగ్జరీ కార్లు ఉన్నాయి. కాని ఎవ్వరి దగ్గరా హై స్పీడ్ స్పోర్ట్స్ వెహికల్స్ మాత్రం లేవు. కేవలం రామ్ చరణ్‌ మరియు నాగ చైతన్య దగ్గరే ఆస్టన్ మార్టిన్ వంటి కార్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే.. మన యంగ్ హీరోలందరిలోకి నాగ చైతన్య ఒక్కడే రేస్ కార్ డ్రైవ్ చేసే సత్తా ఉన్నోడు. ఢిల్లో వంటి చోట్ల రియల్ రేస్ ట్రాకులో కార్లు కూడా నడిపాడు. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం పదండి.

రేసు ఆదివారం హైదరాబాదులో కెనాన్‌బాల్ క్లబ్ అండ్ కార్ క్రాఫ్ట్ రెండో ఎడిషన్ షో ఆలివ్ బిస్టొ జూబ్లీహిల్స్‌లో ఈ ఆదివారం జరగనుంది. ఈ సందర్భంగా అక్కడ వివిధ ఖరీదైన లగ్జరీ కార్లను.. రేసు కార్లను ఎగ్జిబిట్ చేస్తూ.. అక్కడ నుండి శంషాబాద్ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. ఫెరారీ - లాంబోర్గిని - ఆస్టన్ మార్టిన్ - పోర్షే - మసారెటి.. లాంటి ఫాస్టెస్ట్ కార్లు అక్కడ ప్రదర్శితం చేస్తారు. అయితే విషయం ఏంటంటే.. అంత ఫాస్ట్ కార్లను చాలా స్లోగా 20 కిమి వేగంతో నడుపుతూ ఊరంతా ఊరేగించడం వలన.. ర్యాష్‌ డ్రైవింగ్ చేసేవారికి ఒక అవగాహన కల్పించాలని వీరి ఉద్దేశ్యం. అయితే ఈ షో కోసం అతిథిగా వస్తున్న చైతన్య.. తను కూడా ఒక రేసు కారును అక్కడి నుండి శంషాబాద్ వరకు డ్రైవ్ చేస్తాడా అనేదే చూడాల్సిన అంశం.

నిజానికి ఇలాంటి సూపర్ కార్లు ఉన్న ఓనర్లే ర్యాషుగా నడుపుతూ ఉంటారు. మనం ఈ మధ్య కాలంలో చూసిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా లగ్జరీ కార్లే ఉన్నాయి. కాబట్టి ఈ షో ద్వారా అలాంటి కార్ ఓనర్లకు కూడా కనువిప్పు కలిగే ఛాన్సుంది. చూద్దాం చైతూ ఏం చేస్తాడో!!
Tags:    

Similar News