నాగచైతన్య 'లవ్ స్టోరీ' వాయిదా..!

Update: 2021-04-08 14:36 GMT
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య - నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''లవ్ స్టోరీ''. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ అందమైన ప్రేమకథను వేసవి కానుకగా ఏప్రిల్ 16న తెలుగు కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా 'లవ్ స్టొరీ' చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా వాయిదా వేస్తున్నామని.. పరిస్థితులు చక్కబడిన తరువాత రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని దర్శకనిర్మాతలు మీడియా ముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా నాగ చైతన్య - శేఖర్ కమ్ముల - నిర్మాతలు నారాయణ దాస్ నారాంగ్ - సునీల్ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు మాట్లాడారు.

నాగచైతన్య మాట్లాడుతూ.. ''పది రోజుల క్రితం సినిమా చూశాను. శేఖర్ కమ్ముల నాకు మంచి సినిమా ఇచ్చారు. నా సినిమాలను శేఖర్ కమ్ముల సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఆదరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఇది కూడా ఫ్యామిలీతో కలసి అందరూ చూడాల్సిన సినిమా. అందుకే వాయిదా వేసి పరిస్థితులను బట్టి తరువాత రిలీజ్ చేస్తాం'' అని తెలిపారు. శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ''సినిమా బాగా వచ్చింది. సాంగ్స్ సూపర్ హిట్ అవడంతో పీటీ5రిలీజ్ బజ్ కూడా బాగా వచ్చింది. ఫైనల్ ‏గా రిలీజ్ చేయాలనుకునే సరికి మళ్లీ కరోనా వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ తో కలిసి మాట్లాడుకొని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం. పరిస్థితులు చెక్కబడిన తర్వాత విడుదల తేదీ ప్రకటిస్తాం'' అని అన్నారు.
Tags:    

Similar News