ఈ ఏడాది అక్కినేని నాగార్జున ఆనందం అంతా ఇంతా కాదు. ఈ ఏడాది ఆల్రెడీ సోగ్గాడే చిన్నినాయనా.. ఊపిరి లాంటి హిట్లు ఖాతాలో వేసుకున్న నాగార్జునకు తాజాగా ‘ప్రేమమ్’ మరింత ఆనందాన్నిచ్చింది. చైతూను ఈ సినిమా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించడమే కాదు.. అతడి కెరీర్లోనే అతి పెద్ద హిట్టయ్యే దిశగా దూసుకెళ్తోంది. ఈ ఉత్సాహంలో తన కొత్త సినిమా ‘ఓం నమో వెంకటేశాయ’ షూటింగ్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మహాబలేశ్వరంలో జరుగుతోంది. అక్కడ షూటింగ్ అనుభవాల గురించి తాజాగా ఒక ట్వీట్ పెట్టాడు నాగ్.
మహాబలేశ్వరంలో ప్రస్తుతం క్లైమాట్ అద్భుతంగా ఉందట. మంచు వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉండటంతో ఒక వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు నాగ్. ‘‘మహాబలేశ్వరంలో మబ్బుల్లో నడుస్తున్నట్టు.. ప్రపంచపు అంచున ఉన్నట్టుగా అనిపిస్తోంది’’ అంటూ ట్వీట్ చేశాడు నాగ్. శుక్రవారమే కువైట్ నుంచి తిరిగి వచ్చిన నాగ్.. వెంటనే ‘ఓం నమోవేంకటేశాయ’ షూటింగ్ కోసం మహాబలేశ్వరం వెళ్లాడు. అక్కడ రెండు వారాలకు పైగా షెడ్యూల్ సాగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్ తో దాదాపుగా టాకీ పార్ట్ పూర్తవుతుందట. ఓ వైపు షూటింగ్ చేస్తూనే.. మరోవైపు వీఎఫెక్స్.. కంప్యూటర్ గ్రాఫిక్స్ పనుల్ని పర్యవేక్షిస్తున్నాడు దర్శకుడు రాఘవేంద్రరావు. ముందు ఈ సినిమాను సంక్రాంతికి అనుకున్నా.. మరింత ఆలస్యం కావచ్చని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/