అక్కినేని వారి డొనేష‌న్ ఎంత‌?

Update: 2018-08-19 06:56 GMT
కేర‌ళ వ‌ర‌ద‌ల‌కు నిధులు వ‌ర‌దై పోటెత్తుతున్నాయ్‌. అక్క‌డ స‌న్నివేశం చూసి చ‌లించ‌నివాళ్లే లేరు. టాలీవుడ్ నుంచి మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ ఇప్ప‌టికే భారీ విరాళాల్ని డొనేట్ చేశాయి. ఆ ఒక్క కాంపౌండ్ (చిరు - బ‌న్ని - బ‌న్నివాసు త‌దిత‌రులు) నుంచి కోటి వ‌ర‌కూ విరాళం సీఎం రిలీఫ్ ఫండ్‌ కి వెళుతోంది.

ఆ క్ర‌మంలోనే అంత పెద్ద కాంపౌండ్ స్పందించాక ఇత‌ర కాంపౌండ్ల నుంచి స్పంద‌న మొద‌లైంది. ఘ‌ట్ట‌మ‌నేని కాంపౌండ్ నుంచి సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ ఇమ్మీడియ‌ట్‌ గా స్పందించి 25ల‌క్ష‌ల డొనేష‌న్ ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన  గంట‌ల్లోనే అక్కినేని కాంపౌండ్ స్పందించింది. ఆ కాంపౌండ్ నుంచి అక్కినేని అమ‌ల ఏకంగా 28 ల‌క్ష‌ల డొనేష‌న్ ప్ర‌క‌టించి ధాతృత్వం చాటుకున్నారు. మంచిని నేను సైతం అంటూ ప్ర‌తిసారీ ముందుండే అమ‌ల య‌థావిధిగా మ‌రో మంచి సాయానికి ముందుకు రావ‌డం అక్కినేని అభిమానులు స‌హా స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది.

మొత్తానికి అన్ని పెద్ద కాంపౌండ్‌ లు స్పందించి ల‌క్ష‌ల్లో డొనేష‌న్లు ఇస్తున్నాయి. కేర‌ళ వ‌ర‌ద‌ల‌కు కేవ‌లం టాలీవుడ్ నుంచి 2కోట్లు పైగా పోగ‌వుతోంది. ఈ మొత్తం నిజాయితీగా వ‌ర‌ద‌ల్లో న‌ష్ట‌పోయిన బాధితుల‌కు ఆ ప్ర‌భుత్వం అందిస్తుంద‌నే ఆశిద్దాం. ఇక‌పోతే టాలీవుడ్‌లో మ‌రిన్ని కాంపౌండ్‌ లు స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిసింది. నంద‌మూరి కాంపౌండ్ - ద‌గ్గుబాటి కాంపౌండ్  - మంచు కాంపౌండ్‌ నుంచి ఇలాంటి విప‌త్తుల వేళ పెద్ద ఎత్తున విరాళాలు అందుతాయ‌న‌డంలో సందేహం లేదు. మునుముందు ఎవ‌రెంత డొనేట్ చేస్తారు? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మొత్తానికి హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్ వ‌యా పెద్ద మొత్తాలు కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్‌ కి సాయమందుతోంది. మంచికోసం మేముసైతం శ‌హ‌భాష్‌.
Tags:    

Similar News