ఒక సినిమాకు పబ్లిసిటీ ఎంత చేసినా హంగామా సృష్టించినా దాని ప్రభావం ఓపెనింగ్స్ వరకే ఉంటుంది. ఆ తర్వాత లాంగ్ రన్ లో నిలవాలి అంటే ఆ బాధ్యత తీసుకోవాల్సింది కంటెంట్ మాత్రమే. అది లేకుండా ఎంత చప్పుడు చేసినా విని మోసపోయేంత అమాయకత్వం ఇప్పుడున్న ప్రేక్షకుల్లో లేదు. అందుకే జిమ్మిక్కులు పనిచేయడం ఎప్పుడో మానేశాయి.పైగా 4జి విప్లవం పుణ్యమా అని జనానికి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలిసిపోవడమే కాదు నిర్మాతలు హీరోలు చెబుతున్న దానిలో నిజానిజాలు ఎంత ఉన్నాయా అని వెంటనే పసిగడుతున్నారు.
కానీ దేవదాస్ నిర్మాత అశ్వినిదత్ తో పాటు నాగార్జున నానిలు కూడా ఈ విషయాన్నీ కాస్త పక్కన పెట్టినట్టు ఉన్నారు. దసరా పండగ సందర్భంగా దేవదాస్ సక్సెస్ మీట్ అంటూ మరోసారి హడావిడి చేయడం మీడియాను సైతం ఆశ్చర్యపరిచింది. కారణం ఫైనల్ క్లోజింగ్ కు దగ్గరగా ఉన్న దేవదాస్ రన్ కు ఇప్పుడు సక్సెస్ మీట్ ఏంటా అని. అంతే కాదు 65 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది అంటూ ప్రత్యేకంగా పోస్టర్లు వదలడమే కాదు సక్సెస్ మీట్ లో ఇదే విషయాన్ని నాగ్ తో సహా అందరు ప్రత్యేకంగా ప్రస్తావించడం చూస్తే ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టరో అనిపించక మానదు.
కానీ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. 38 కోట్ల థియేట్రికల్ రైట్స్ అమ్ముకున్న దేవదాస్ ఇప్పటి దాకా రాబట్టుకుని 25 లోపే. ఇంకా పదమూడు దాకా రావాలి. ఇప్పుడున్న పోటీ సినిమాల తాకిడిలో ఇది అసాధ్యం. అందుకే డివైడ్ టాక్ ఉన్న సినిమాల మధ్య ఎంతో కొంత పండగ కలెక్షన్లు రాబట్టుకోవాలి అనే ఉద్దేశంతో దత్తు ఇది ప్లాన్ చేసారు కానీ ఇలాంటివి వర్క్ అవుట్ అయ్యేనా. ఇది ప్లాప్ కాదని రుజువు చేయడానికే ఈ తంటాలన్నీ అర్థమైపోతోంది. అయినా మూడు వారాల తర్వాత కూడా సక్సెస్ మీట్ పెట్టి మాది హిట్టు అంటే నమ్మే రోజులా ఇవి.