టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ల హవా సాగుతూనే ఉంది. ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి నటించే సినిమాలకు మార్కెట్ గిరాకీ కూడా బాగానే ఉంది. ఆ కోవలో ఇప్పటికే బోలెడు సినిమాలొచ్చాయి. విజయాలు సాధించాయి. మునుముందు మరిన్ని రాబోతున్నాయి. కింగ్ నాగార్జున కూడా కార్తీ హీరోలుగా ప్రస్తుతం ఓ సినిమా సెట్స్‌కెళుతోంది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా కథానాయికగా ఎంపికైంది.
అలాగే మోహన్‌లాల్, పునీత్ రాజ్‌కుమార్ హీరోలుగా తెరకెక్కి ఘనవిజయం సాధించిన కన్నడ చిత్రం 'మైత్రి'ని తెలుగులో రీమేక్ చేయడానికి నాగార్జున ఆసక్తి కనబరిచారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాని ఈ సినిమాలో మరో హీరో కూడా నటించాలి. మరీ ఇమేజ్ లేని హీరో చేస్తే అది వర్కవుట్ కాదు. అందుకే ఆ పాత్రకు తనకు బావ అయ్యే వెంకటేష్‌కే ఇచ్చారా అంటే అవుననే అంటున్నారు అన్నపూర్ణ వర్గాలు. పునీత్ పోషించిన రియల్ లైఫ్ పాత్రలో నాగార్జున నటిస్తారట. ఆ సైంటిస్ట్ పాత్రలో వెంకటేష్ నటిస్తారట. అలాగే ఇదే చిత్రంలో హీరో శ్రీకాంత్ తనయుడు మాష్టర్ రోషన్ నటిస్తాడని తెలుస్తోంది.
ఇటీవలే నాగార్జున కోసం ప్రివ్యూ వేశారు. సినిమా నచ్చింది. నాగ్ ఓకే అన్నారు.. అయితే వెంకీ ఈ సినిమాకు ఫుల్ ప్లెడ్జడ్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. ఇకపోతే త్వరలోనే వెంకీ మరో మల్టీస్టారర్‌లో నటిస్తున్నాడు. తన అన్న కొడుకు రానాతో కలసి చేసే ఫ్యామిలీ మూవీ అది.