24 నుంచి నాగ్ డాన్.. నాని డాక్టర్

Update: 2018-02-07 04:58 GMT
ఓవైపు అక్కినేని నాగార్జునేమో ముంబయిలో రామ్ గోపాల్ వర్మ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. మరోవైపు నాని ఏమో చకచకా ‘కృష్ణార్జున యుద్ధం’ పూర్తి చేసే హడావుడిలో ఉన్నారు. వీళ్లిద్దరూ ఇంకో రెండు వారాల్లో చేతులు కలపబోతున్నారు. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సీనియర్.. ఆ జూనియర్ కలిసి మల్టీస్టారర్ చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 24న ప్రారంభోత్సవం జరుపుకోబోతోంది. ఈ తంతు అయ్యాక కొంచెం గ్యాప్ ఇచ్చి.. రెగ్యులర్ షూటింగ్ మార్చిలో మొదలుపెట్టనుంది చిత్ర బృందం.

నలుగురు యువ కథానాయకులతో ‘శమంతకమణి’ అనే వెరైటీ మల్టీస్టారర్ ట్రై చేసి విఫలమైన శ్రీరామ్ ఆదిత్య.. నాగ్-నాని కోసం ఒక ఫన్నీ స్టోరీ రెడీ చేశాడట. ఈ చిత్రంలో నాగార్జున మాఫియా డాన్ పాత్ర పోషిస్తుండగా.. నాని డాక్టరుగా కనిపించనున్నాడు. ఇద్దరి పాత్రలు.. వాళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా ఉంటాయని అంటున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ చిత్రంలో కథానాయికలెవరన్నది ఇంకా తేలలేదు. ఈ సినిమా మొదలయ్యే లోపు నాగ్.. నాని ఇప్పుడు చేస్తున్న సినిమాల్ని ముగించేస్తారు. నాని ఈ చిత్రంతో పాటే కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయబోతున్న సినిమాను కూడా మొదలుపెట్టి సమాంతరంగా ఆ చిత్ర షూటింగులోనూ పాల్గొంటాడని సమాచారం.

Tags:    

Similar News