సంక్రాంతి సీజన్ లో తెలుగు సినిమాలు ప్రతీ ఏడాది సందడి చేయడం తెలిసిందే. కొంత మంది హీరోలకు ఈ పండగ సీజన్ ఓ సెంటిమెంట్ కూడా. సంక్రాంతికి బరిలో దిగితే తమ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అనే సెంటిమెంట్ ని చాలా మంది హీరోలు ఫాలోఅవుతుంటారు. అదే సెంటిమెంట్ లో ఈ సంక్రాంతి బరిలోకి దిగుతున్న మూవీ `బంగార్రాజు`. దేశ వ్యాప్తయంగా మారుతున్న పరిస్థితులు, ఒమిక్రాన్, కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సంక్రాంతికి పోటీపడాలనుకున్న పాన్ ఇండియా చిత్రాలు ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ అర్థాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే.
అయితే భారీ చిత్రాలే రిలీజ్‌కు భయపడుతుంటే `బంగార్రాజు` మాత్రం సై అంటూ రిలీజ్ డేట్ ప్రకటించేసి సంక్రాంతి బరిలో నిలవడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. బడా బడా నిర్మాతలే తమ చిత్రాలని వాయిదా వేసుకున్న వేళ కింగ్ నాగార్జున తను ప్రతిష్టాత్మకంగా భావించిన `బంగార్రాజు`ని రిలీజ్ చేస్తున్నారు.. ఏంటీ ఆయన ధైర్యం? ...ఓటీటీ ప్లాట్ ఫామ్ లు భారీ చిత్రాలకు క్రేజీ ఆఫర్లు ఇస్తున్నా `బంగార్రాజు`ని థియేటర్లలోనే విడుదల చేస్తుండటానికి గల ధైర్యమేంటీ? ఆ వెనకాలున్న బలమైన కారణం ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అయితే తన సినిమా రిలీజ్ వెనక జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నాగార్జున. మిగతా సనిమాలు వెనక్కి వెళ్లినా తను మాత్రం పండగ సీజన్ ని ఎంచుకోవడం పగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తుండటం వెనకున్న ధైర్యం ఏంటో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించి షాకిచ్చారు. మేము సంక్రాంతి పోట్ల గిత్తల్లా రెడీగా వున్నాం. అంతే కాకుండా `బంగార్రాజు` పండగ సినిమా అని నేను బలంగా నమ్మాను. అంతే కాకుండా ఇది పొంగల్ ఫిల్మ్. ఇక మన తెలుగు ప్రేక్షకుల్లో గ్రామీణ వాతావరణ నేపథ్య చిత్రాలని ఆదరించే సంప్రదాయం వుంది.
ఈ పండగ సీజన్ లో ప్రతీ ఒక్కరూ తమతమ సొంతూళ్లకు చేరుకుని ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో కలిసి థియేర్లలో సెలబ్రేట్ చేసుకుంటుంటారని నేను బలంగా నమ్ముతాను. ఇక సంక్రాంతికి ప్రేక్షకులు ఒక సినిమా కాదు.. మూడు సినిమాలు చూస్తారన్నది నాకు తెలిసిన దగ్గర నుంచి ఆనవాయితిగా వస్తోంది` అని తెలిపారు నాగ్. ఇక సంక్రాంతి సీజన్ లో దాదాపు 400 నుంచి 450 కోట్ల వరకు బిజినెస్ జరుగుతూ వుంటుంది. బి5జినెస్ కూడా సంప్రదాయానికి అనుగుణంగా జరగుతోంది` అని స్పష్టం చేశారు. `బంగార్రాజు` ట్రైలర్ బుధవారం విడుదల కాబోతోంది.
కింగ్ నాగ్ ఫుల్ కాన్షిడెన్స్ తో వున్న `బంగార్రాజు` మూవీ 2016లో వచ్చిన `సోగ్గాడే చిన్ని నాయన`కు ప్రీక్వెల్ గా రూపొందిన విషయం తెలిసందే. కింగ్ నాగ్ తో కలిసి నాగచైతన్య కూడా హీరోగా నటిస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. వీరిద్దరే కాకుండా మరో ఆరుగురు కలర్ ఫుల్ భామలు ఈ చిత్రంలో సందడి చేయబోతున్నారు.