పుత్రోత్సాహము పుత్రుని కనంగ ..! అని ఓ పద్యం. ఆ ఉత్సాహం కలకాలం నిలవాలంటే.. ఆ సుపుత్రుడు ఎదిగి కెరీర్ లో స్థిరపడినప్పుడే సాధ్యం. ప్రస్తుతం ఈ విషయంలో కింగ్ నాగార్జుననే అడిగితే ఏమని చెప్పారో తెలుసా?.. చైతన్య వరుస విజయాలతో ట్రాక్ లోకి వచ్చాడు. అది సంతోషమే. ఇక అఖిల్ ఆరంగేట్రం గురించే నా తపనంతా. అఖిల్ పై నాకు పూర్తి నమ్మకం ఉంది. అతడు పెర్ఫెక్షనిస్ట్. 8వ తరగతిలోనే క్రికెట్ ఆడతానన్నాడు. ఆడి మెప్పించాడు. ఇప్పుడు అంతే పెర్ఫెక్ట్ గా యాక్టర్ గానూ నిరూపించుకుంటాడు.
అయితే అఖిల్ నటించే సినిమాని అన్నపూర్ణ బ్యానర్ లో కాకుండా వేరొక బ్యానర్ లో నిర్మించడానికి కారణం ఉంది. అఖిల్, నితిన్ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. నితిన్ అడగ్గానే స్నేహితులు కంఫర్ట్ గా ఉంటారనిపించి ఓకే చెప్పాను. అయినా నా కంటే వాళ్లే (శ్రేష్ఠ్ మూవీస్) బాగా తీస్తున్నారు. బాగా పెట్టుబడులు పెట్టి సినిమా తీస్తున్నారు... అని నాగ్ చెప్పారు.
అఖిల్ కోసం మనం ఫేం విక్రమ్ కుమార్ కొన్ని కథలు చెప్పాడు. ఈలోగానే మనం సినిమాలో అఖిల్ ని చూసిన వినాయక్ తనతో సినిమా చేస్తానంటూ ఓ కథ తెచ్చాడు. అది బాగా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశా. హీరోల్ని జనాల దగ్గరికి చేర్చే సత్తా ఉన్న దర్శకుడు వినాయక్. ఇక ఆర్టిస్టు అంటే కెమెరా ఫియర్ ఉండకూడదు. డ్యాన్సులు, ఫైట్స్ తో పాటు నటనలో ఈజ్ కావాలి. అప్పుడే నిరూపించుకోగలరు. అఖిల్ లో అవన్నీ చూశాను. విదేశీ షూటింగులో పరిశీలించానని కింగ్ నాగార్జున చెప్పారు.