అక్కినేని మిసైల్ అఖిల్ దూసుకొస్తున్నాడు. దసరా బరిలో మిస్ అయినా క్వాలిటీ వర్క్ తో దీపావళి బరిలోకి దిగిపోతున్నాడు. ఈ దీపాల అమావాస్య కానుకగా నవంబర్ 11న అక్కినేని నటవారసుడు నటించిన అఖిల్ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ విషయాన్ని నిన్ననే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అఖిల్ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ - ఎఫెక్ట్స్ వర్క్ 100శాతం పూర్తి చేసుకుని ఈనెల 11న వచ్చేస్తున్నాం అని ప్రకటించారు.
నిజానికి దసరా బరి నుంచి అఖిల్ వాకౌట్ చేయడం అనేది అంతా డ్రమటిక్ గా సాగిపోయింది. అభిమానులూ నిరాశ చెందొద్దు అంటూ నాగార్జున స్వయంగా పిలుపునిచ్చారు. గ్రాఫిక్స్ లో క్వాలిటీ పెంచేందుకు ఇలా చేయాల్సొచ్చింది. .. సారీ ! అని చెప్పారు. అయితే రాజమౌళి వంటి ఉద్ధండుడు ఈగ - బాహుబలి చిత్రాల్ని క్వాలిటీ వర్క్ కోసం వాయిదా ఏళ్ల తరబడి వాయిదా వేసుకున్నారు. అఖిల్ కోసం ఆమాత్రం చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు నాగార్జున.
అఖిల్ డెబ్యూ సినిమా స్పెషల్ గా ఉండాలన్నది అందరి ఆలోచన. అందుకే ఎక్కడా రాజీకి రాకుండా గ్రాఫిక్స్ పని చేసేవాళ్లకు కావాల్సినంత టైమ్ ఇచ్చి మరీ పని చేయిస్తున్నాం.. అని నాగ్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి హర్రీ పోయింది. ఇక సినిమా రిలీజ్ కి వస్తోంది. దీపావళి రోజు అఖిల్ డెబ్యూ అనేదే సంథింగ్ స్పెషల్.