నాగ్ కన్ఫ‌మ్ చేశాడు

Update: 2016-03-17 17:30 GMT
అఖిల్ రెండో సినిమా గురించి చాలా రోజులుగా సందిగ్ధం కొన‌సాగుతోంది. ఆ సినిమాకి ద‌ర్శ‌కుడు సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేమ్ క‌ళ్యాణ్‌ కృష్ణ అని కొంద‌రు, కాదు వేరొక‌రు అని మ‌రికొంద‌రు మాట్లాడుకుంటున్నారు. నెల‌లు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ అస‌లు విష‌యం మాత్రం వెలుగులోకి రావ‌డం లేదు. ఇంత‌కీ  రెండో సినిమా గురించి అఖిల్ ఏదైనా నిర్ణ‌యం తీసుకొన్నాడా లేక ఇంకా క‌థ‌లు వింటూనే ఉన్నాడా అంటూ ఫ్యాన్స్ కూడా గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. కానీ తాజాగా అఖిల్ రెండో చిత్రానికి ద‌ర్శ‌కుడు ఎవ‌రో తేలిపోయింది. ఊపిరి సినిమాని తీసిన వంశీ పైడిప‌ల్లినే అఖిల్‌ తో సినిమా చేస్తాడ‌న్న విష‌యం  ఖ‌రారైంది. ఆ విష‌యాన్ని స్వ‌యంగా నాగార్జునే క‌న్ఫ‌మ్  చేశాడు.

ఊపిరి ప్ర‌మోష‌న్స్‌ లో భాగంగా గ‌త రెండు రోజులుగా నాగార్జున మీడియాతో స‌మావేశ‌మవుతున్నాడు. త‌న సినిమాతోపాటు త‌న త‌న‌యులు సినిమాల గురించి కూడా ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డిస్తున్నాడు. అందులో భాగంగానే అఖిల్ సినిమా గురించి చెప్పుకొచ్చాడు నాగ్‌. వంశీ పైడిప‌ల్లితో అఖిల్ సినిమా చేస్తున్నాడ‌ట‌గా అని మీడియా అడిగిన‌ప్పుడు... ``యెస్... వాళ్లిద్ద‌రూ మాట్లాడుకుంటున్నారు. క‌థ‌ల గురించి చ‌ర్చించుకుంటున్నారు. వంశీ పైడిప‌ల్లి మంచి ద‌ర్శ‌కుడు. అఖిల్‌ - వంశీ క‌లిసి సినిమా చేయొచ్చు`` అని చెప్పుకొచ్చాడు నాగ్‌. ఆ సినిమా కూడా అన్న‌పూర్ణ స్టూడియో బ్యాన‌ర్‌ లోనే తెర‌కెక్కే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News