ఆ ఒక్కడు నాగార్జునేనా?

Update: 2016-01-03 11:30 GMT
సంక్రాంతికి అనుకున్నట్లే నాలుగు సినిమాలూ వస్తాయా లేదానే విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శర్వానంద్ సినిమా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ధైర్యంగా రేసులోకి దిగేయడం చూస్తుంటే మూడు పెద్ద సినిమాల్లో ఒకటి తప్పుకోవడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఆ ఒక్క సినిమా ఏదన్నదే ఆసక్తి రేపుతున్న ప్రశ్న. ఐతే అందరికంటే ముందు సంక్రాంతికి డేట్ ప్రకటించి.. ‘‘సంక్రాంతికి వస్తున్నాం. కొడుతున్నాం’’ అంటూ నొక్కి వక్కాణించిన నాగార్జునే రేసులోంచి తప్పుకుంటాడేమో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ.. ఇంత పోటీలో సినిమాను విడుదల చేయడం మంచిది కాదేమో అని జాగ్రత్తపడుతున్నాడట నాగ్.

బాలయ్య - ఎన్టీఆర్ సంక్రాంతి విడుదలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కాబట్టి వాళ్లిద్దరూ పునరాలోచించే ప్రసక్తే లేదు. కాబట్టి తాను అంత ఇగో చూపించాల్సిన పని లేదని.. సినిమాను వాయిదా వేసుకుందామని చూస్తున్నాడట నాగ్. ఐతే సంక్రాంతికి సినిమాను పూర్తిగా రేసు నుంచి మాత్రం తప్పించట్లేదు. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్.. ఈ రెండింట్లో ఏదో ఒకటి తప్పుకుంటుందేమో అని వెయిట్ చేస్తున్నాడట. అవి పక్కా అయితే నాగ్ సినిమా వచ్చే అవకాశం లేదు. ఏదైనా ఒకటి తప్పుకుంటే మాత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’ ముందు అనుకున్నట్లే జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. తన, తన కొడుకుల సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో చాలా ప్లాన్డ్ గా ఉంటాడు నాగ్. ఏదో ప్రతిష్టకు పోయి సినిమాను విడుదల చేసి.. కలెక్షన్లలో కోత పెట్టుకోవడం కరెక్ట్ కాదన్నది నాగ్ అభిప్రాయం.
Tags:    

Similar News