అఖిల్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ ఈ దసరాకి రిలీజ్ కావాల్సింది. కానీ అనూహ్యంగా చివరి క్షణంలో వాయిదా వేశారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఉందని నాగార్జున స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పారు. అఖిల్ చిత్రంలో గ్రాఫిక్స్ వందశాతం సంతృప్తికరంగా లేవు. 75శాతం గ్రాఫిక్స్ పూర్తయ్యాయి. అందులో 25 శాతం మెరుగుపరచాల్సి ఉందింకా, మరో 25 శాతం గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉందంటూ నాగార్జున చెప్పారు. అయితే అసలు ఇందులో నాగార్జునకు ఏం నచ్చలేదో అప్పటికి మాత్రం రివీల్ చేయలేదు. అసలేం నచ్చలేదు? అన్నది ఆరాతీస్తే..
ఈ చిత్రంలో అఖిల్ ఓ భీకరమైన పులితో పోరాడే సన్నివేశం ఒకటి ఉంది. పులితో పోరాటం అంటే గ్రాఫిక్స్ పనే కాబట్టి అక్కడ అంత పెర్ఫెక్షన్ రాలేదని నాగార్జున భావించారుట. ఆ సంగతినే చెప్పి గ్రాఫిక్స్ బాగా వచ్చే వరకూ వర్కవుట్ చేయండని సూచించారుట. అందుకే ఈ సినిమా రిలీజ్ ని వాయిదా వేశామని చెప్పారు. అఖిల్ విషయంలో కింగ్ ఏమాత్రం ఏమరు పాటుగా లేరు. ఎక్కడ ఏం నచ్చకపోయినా దానిని రీషూట్ చేయించడానికైనా వెనకాడలేదు. వినాయక్ తో నాగార్జున ప్రతి విషయం డీటెయిల్ గా చర్చించాకే ప్రాజెక్టు ముందుకెళ్లింది. స్టార్ కిడ్ ఇంట్రడక్షన్ అంటే ఒకటే ఒత్తిడి. ఈ విషయంలో క్రిష్ సైతం ఎంతో ఒత్తిడికి గురయ్యానని చెప్పాడు. వరుణ్ తేజ్ రెండో సినిమాని ఓ పీరియడ్ కథతో తీయాలనుకుని సాహసమే చేశాను. పెర్ఫెక్షన్ కోసం చాలా తీవ్రంగా శ్రమించాల్సొచ్చిందని క్రిష్ చెప్పారు.