టాలీవుడ్ లో అభిమానులు స్టార్ హీరోలని డెమీ గాడ్స్ గా చూస్తుంటారు. నచ్చిన హీరో కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోతుంటారు. అఫ్ కోర్స్ తమని అభిమానించే ఫ్యాన్స్ కోసం కూడా ఈ మధ్య మన హీరోలు ఎంతటి రిస్క్ ని అయినా ఫేస్ చేయడానికి, సరికొత్త పాత్రల్లో అలరించడానికి ముందుకొస్తున్నారు. ప్రయోగాలు చేస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే కింగ్ నాగార్జున ఫ్యాన్స్ మాత్రం ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా వున్నారట. తమ హీరోకు తప్పిన ఉపద్రవాన్ని తలుచుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారట.
వివరాల్లోకి వెళితే.. కింగ్ నాగార్జున 'బంగార్రాజు' తరువాత ప్రస్తుతం 'గరుడవేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ది ఘోస్ట్' పేరుతో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. సొనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఈ మూవీకి ముందు నాగార్జున ఓ సినిమా చేయాల్సిందట.
అదే మాస్ మహారాజా రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ చిత్ర దర్శకుడు శరత్ మండవ ముందు ఈ కథని నాగార్జునకే వినిపించారట. నాగార్జునకు అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి ద్వారా కలిసిన శరత్ మండవ మొత్తానికి కథ వినిపించాడట. అదే సమయంలో నాగ్ వరుస సినిమాలతో బిజీగా వుండటంతో ఈ మూవీని వేరే యంగ్ హీరోతో చేసుకోమని చెప్పారట. దీంతో ఈ కథ రవితేజ ముందుకు వెళ్లిందని తెలుస్తోంది.
సుధాకర్ చెరుకూరి తనకు మంచి మిత్రుడు కావడంతో వెంటనే ఈ మూవీ పట్టాలెక్కిందని చెబుతున్నారు. రీసెంట్ గా ఈ మూవీ విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకుని డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ న్యూస్ విన్న నాగార్జున తన రిజెక్ట్ చేసి మంచి పని చేశానని హ్యాపీగా ఫీలయ్యారట. నాగ్ ఫ్యాన్స్ కూడా ఇదే ఫీలవుతున్నారిప్పుడు. తనదైన జడ్జమెంట్ నాగార్జున భారీ డిజాస్టర్ నుంచి భలే ఎస్కేప్ అయ్యాడని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారట.
ఇదిలా వుంటే 'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ టైమ్ లో ట్విట్టర్ రివ్యూలపై కామెంట్ లు చేసిన దర్శకుడు శరత్ మండవ ప్రస్తుతం ట్రోలింగ్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తన సోషల్ మీడియా అకౌంట్ ని లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ తనని ట్రోల్ చేస్తారో అనే భయం వల్లే శరత్ మండవ ఈ పని చేసినట్టుగా ఇన్ సైడ్ టాక్.