నాగ్ అభిమానులు ఎలా రియాక్టవుతారో

Update: 2016-02-06 11:30 GMT
సంక్రాంతికి చడీచప్పుడు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ ను షేక్ చేసేశాడు అక్కినేని నాగార్జున. దీనికి ముందు నాగ్ నటించిన ‘మనం’ కూడా పెద్ద హిట్టే. అది కూడా బ్రహ్మాండమైన వసూళ్లు సాధించింది. కానీ అక్కినేని అభిమానుల్లో ఆశించినంత ఉత్సాహం మాత్రం కలిగించలేకపోయింది ఆ సినిమా. అభిమానులు నాగార్జునను అలాంటి సాఫ్ట్ క్యారెక్టర్ లో చూడటం కంటే.. బంగార్రాజు తరహా మాస్ క్యారెక్టర్ లో చూడ్డానికే ఇష్టపడతారనడంలో సందేహం లేదు. అందుకే ఈ సినిమా ఫ్యాన్స్ లో చాలా ఉత్సాహం నింపింది. ఒకప్పుడు నాగ్ ఫ్యాన్స్ యమ దూకుడు మీద ఉండేవాళ్లు కానీ.. గత కొన్నేళ్లలో నాగ్ వైవిధ్యమైన సినిమాల పేరుతో అభిమానుల్ని అలరించే క్యారెక్టర్లు తగ్గించేశాడు. నాగచైతన్య కూడా క్లాస్ సినిమాలే చేయడంతో అక్కినేని ఫ్యాన్స్ లో ఉత్సాహం తగ్గిపోయింది.

ఐతే ‘సోగ్గాడే..’ అక్కినేని అభిమానుల్ని మళ్లీ రీయునైట్ చేసింది. వారిలో పాత ఉత్సాహం తెచ్చింది. నాగ్ కెరీర్లోనే అతి పెద్ద హిట్టు కొట్టడం.. సంక్రాంతికి అంత పోటీలోనూ వసూళ్ల వర్షం కురిపించడంతో నాగ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారిప్పుడు. ఈ పరిస్థితుల్లో నాగ్ తర్వాతి సినిమాను అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారా అన్నది సందేహంగా మారింది. ఎందుకంటే ‘ఊపిరి’లో నాగార్జున చక్రాల కుర్చీకి అతుక్కుపోయే పాత్ర. బంగార్రాజు లాంటి పాత్రతో అంత హీరోయిజం చూపించి, అంత ఎంటర్ టైన్ చేసిన తర్వాత నాగ్ ఇలాంటి క్యారెక్టర్ లో కనిపిస్తే అభిమానులకు అదోలాగే ఉంటుంది. ‘సోగ్గాడే..’ రాకముందు ‘ఊపిరి’ వస్తే ఇబ్బందేమీ ఉండేది కాదు కానీ.. ఆ సినిమాతో అభిమానుల్లో ఒక ఊపు వచ్చాక నాగ్ ను ఇలా చూడ్డం మాత్రం కొంచెం ఇబ్బందే. మరి ‘ఊపిరి’ని నాగ్ అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. ఆ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
Tags:    

Similar News