''అవును. 21 ఏళ్లకే అంత మెట్యూరిటీ నాకెక్కడ నుండి వచ్చింది.. రాలేదు. అస్సలు రాలేదు. నేను 10 సినిమాలు చేశాక కూడా ఇలాంటి ఫీట్లు ఏవీ చేయలేకపోయా. అందుకే నాకంటే మావోడు ఎంతో బెటర్'' అంటున్నారు అక్కినేని నాగార్జున. చిన్న కొడుకు అఖిల్ తెరంగేట్రం గురించి మాట్లాడుతూ.. నాగ్ స్వయంగా ఈ విషయాలను చెప్పుకొచ్చారు.
నిజానికి అఖిల్ సినిమా బాక్సాఫీస్ రిజల్టు ఎలా ఉన్నా కూడా.. దానికి సరైన రెస్పాన్సు రాకున్నా.. తన కొడుకు పెర్ఫామెన్స్ వరకు తాను చాలా హ్యీపీ అంటున్నారు కింగ్. ఎందుకంటే చిన్న వయస్సులో ఒక హీరోగా ప్రూవ్ చేసుకోవాలంటే కష్టమైన అంశమట. అందుకోసం అఖిల్ పడిన కష్టం, తాపత్రయం చాలా అమేజింగ్ అంటున్నారాయన. ''అసలు అంతలా డ్యాన్సులు చేయాలంటే నాకు చాలా టైమ్ పట్టింది. ఫైట్లు చేయడం ఏముంది.. చాలా ఈజీ. కాని డ్యాన్సులకు మాత్రం ఆ రిథమ్.. టైమింగ్..ఈజ్.. చాలా ఉండాలి. అసలు అవన్నీ అఖిల్ ఎప్పుడు ప్రాక్టీస్ చేశాడో తెలియదు'' అన్నారు కింగ్.
మరి ఈ డ్యాన్సుల మహత్యం తాత అక్కినేని నాగేశ్వరరావు నుండి వచ్చిందని అనుకోవాలా?? ''ఆ సంగతి తెలియదు. కాని అఖిల్ విషయంలో మాత్రం వాళ్లమ్మ అమల మాంచి డ్యాన్సర్. తను క్లాసికల్ లో ఎంతో ప్రావిణ్యం సాధించింది. సో.. అఖిల్ కు ఆ సైడ్ నుండి జీన్స్ ఎక్కువగా వచ్చినట్లున్నాయ్'' అంటూ చలాకీగా చెప్పేశారు.