టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎన్నో ప్రయోగాలు చేసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. ఇప్పటి వరకు ఆయన వెండి తెరపై ఎన్నో రకాల పాత్రల్లో నటించారు. శివ వంటి ట్రెండ్ సెట్టర్ సినిమాను చేయడం మాత్రమే కాకుండా అన్నమయ్య అంటూ భక్తిరస సినిమాను చేసి మరే హీరోకు సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆయన చేసిన విభిన్నమైన పాత్రలు ఆయన స్థాయిని ఆకాశంలో ఉంచాయి అనడంలో సందేహం లేదు. నాగార్జున హీరోగా ఈమద్య కాస్త డౌన్ అయినట్లుగా అనిపిస్తున్నాడు. ఈ సమయంలో ఆయన బుల్లి తెర మరియు ఓటీటీ ద్వారా తన సత్తాను చాటుతున్నాడు.
ఇప్పటికే ఎవరు మీలో కోటీశ్వరుడు షో తో బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన నాగార్జున ఆ తర్వాత బిగ్ బాస్ తో కూడా బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ఉన్నాడు. వరుసగా మూడు సీజన్ లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. ఇప్పుడు ఓటీటీ బిగ్ బాస్ కు కూడా ఆయన హోస్ట్ గా వ్యవహరించేందుకు సిద్దం అయ్యాడు. బిగ్ బాస్ హోస్ట్ గా ఇప్పటికే మెప్పించిన నాగార్జున ఓటీటీ బిగ్ బాస్ తో మరింతగా ప్రేక్షకుల ముందుకు చేరువ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బిగ్ బాస్ ఓటీటీ కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారితో నాగార్జున భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎపిసోడ్స్ ప్రకారం పారితోషికంను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఇవ్వబోతున్నారు. షో సక్సెస్ ఫుల్ గా నడిస్తే రెగ్యులర్ షో మాదిరిగా 100 రోజులకు మించి కంటిన్యూ చేస్తారట. షో కు ఆశించిన స్థాయిలో వ్యూస్ రాకుంటే పది నుండి పన్నెండు వారాల్లోనే షో ను ముగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నాగార్జున చాలా నమ్మంతో ఈ షో ను చేసేందుకు సిద్దం అవుతున్నారు.
ఓటీటీ బిగ్ బాస్ అంటే చిన్న చూపు చూడకుండా నాగ్ ముందుకు రావడం అభినందనీయం అనడంలో సందేహం లేదు. బిగ్ బాస్ ఓటీటీ పూర్తి అయిన తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారితో రిలేషన్ షిప్ కొనసాగించేలా నాగార్జున సదరు ఓటీటీ లో వెబ్ సిరీస్ ను చేసేందుకు ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది. కొత్త దర్శకుడితో నాగార్జున ఒక వెబ్ సిరీస్ ను చేసేందుకు ఇప్పటికే ఓకే చెప్పాడట. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఆ వెబ్ సిరీస్ ను నిర్మించబోతున్నట్లుగా అక్కినేని వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ అతి పెద్ద ఎంటర్ టైన్‌మెంట్ మాధ్యమంగా మారింది. అందుకే సూపర్ స్టార్.. చిన్న స్టార్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అక్కడ కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ పలువురు ఓటీటీ కంటెంట్ లో నటించారు. సౌత్ లో ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్ ల జోరు మొదలు అయ్యింది. టాలీవుడ్ హీరోలు వెంకటేష్.. రానా మరియు నాగ చైతన్యలు వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఇప్పటికే ఆ విషయమై అధికారికంగా ప్రకటనలు కూడా వచ్చాయి.
ఒక వెబ్ సిరీస్ రీమేక్ లో రానా మరియు వెంకటేష్ లు నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో ఆ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. అందుకోసం రానా మరియు వెంకటేష్ లు ముంబాయిలో ఉన్నారు. మరో వైపు నాగ చైతన్య కూడా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చేసేందుకు సిద్దం అయ్యాడు. వీరిద్దరి వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వారు భారీ ఎత్తున నిర్మించబోతున్నారు. నాగార్జున వెబ్ సిరీస్ ను హాట్ స్టార్ వారు భారీ మొత్తం ఖర్చు చేసి మరీ నిర్మించేందుకు ముందుకు వచ్చారట.
బిగ్ బాస్ ఓటీటీ సక్సెస్ అయితే వెంటనే నాగార్జున ఆ వెబ్ సిరీస్ ను చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు పలువురు స్టార్ హీరోలకు ఓటీటీ కంటెంట్ ఆఫర్లు వచ్చాయి. కోట్ల పారితోషికంతో స్టార్స్ తో వెబ్ సిరీస్ లు చేసేందుకు ప్రముఖ ఓటీటీలు సిద్దంగా ఉన్నాయి. కాని ఇప్పటి వరకు వెంకటేష్ మాత్రమే స్టార్ హీరోల్లో వెబ్ సిరీస్ లు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా ప్రకటించాడు.
ఇప్పుడు నాగార్జున కూడా వెబ్ సిరీస్ ను చేసేందుకు సిద్దం అవ్వడం చర్చనీయాంశం అయ్యింది. గత ఏడాది నుండే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా నాగార్జున నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. కాని అది కార్యరూపం దాల్చలేదు. నాగార్జున తన సొంత నిర్మాణంలో కాకుండా మొదటి వెబ్ సిరీస్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ల నిర్మాణంలో చేసేందుకు సిద్దం అయ్యాడు. మరో వైపు ఆయన సినిమాల విషయానికి వస్తే ఇటీవలే సంక్రాంతికి బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
మరో వైపు ఘోస్ట్ సినిమా ను చేస్తున్నాడు. ప్రవీన్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఘోస్ట్ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం వరకు పూర్తి అయ్యిందట. మరో వైపు బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర సినిమా లో కూడా నాగార్జున నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమాలతో ఇంత బిజీగా ఉన్న నాగార్జున బిగ్ బాస్ తో ఓటీటీ ప్లాట్ ఫామ్ పై అడుగు పెట్టి వెబ్ సిరీస్ తో కంటిన్యూ అవ్వబోతున్నాడు. మరి ఆయన కొత్త జర్నీ ఎలా ఉంటుంది అనేది చూడాలి.