స్టార్ హీరోలతో పని చేసేటపుడు డైరెక్టర్లు ఓ మాట అంటుంటారు. ‘‘మా హీరోను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపిస్తున్నా’’ అని. కానీ ఇది మాటలకే పరిమితమైపోతూ ఉంటుంది. నిజంగా అభిమానుల టేస్టును పట్టే దర్శకులు కొద్దిమందే ఉంటారు. పవన్ కళ్యాణ్ విషయంలో చాలామంది ఈ మాట చెప్పారు కానీ.. నిజంగా అభిమానుల టేస్టును గుర్తించి.. పవన్ ను వాళ్లు కోరుకున్నట్లుగా చూపించింది అంటే హరీష్ శంకరే. అతను తీసిన ‘గబ్బర్ సింగ్’ అంతగా నచ్చింది పవన్ అభిమానులకు. ఇలా ఒక హీరో సిగ్నేచర్ స్టయిల్ ఏంటన్నది గుర్తించి దాన్ని సరిగ్గా తెరమీదికి తెచ్చే దర్శకులు కొద్ది మందే ఉంటారు.
నాగార్జున సిగ్నేచర్ స్టయిల్ అంటే రొమాన్స్. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేయడంలో ఆయన స్టయిలే వేరు. ఐతే గత కొన్నేళ్లుగా ఆయన తన స్టయిల్లో సినిమాలు చేయట్లేదు. గత ఏడాది కూడా మనం లాంటి మాంచి హిట్టు కొట్టాడు కానీ.. నిజంగా నాగ్ అభిమానులు కోరుకునేది ఆ తరహా సినిమా కాదు. ఆయన్ని రొమాంటిక్ కింగ్‌గా చూడటమే వాళ్లకిష్టం. ఆ లోటును ‘సోగ్గాడే చిన్నినాయనా’ తీర్చేసింది. ఇందులో నాగ్ పోషించిన బంగార్రాజు క్యారెక్టర్ చూసినా.. అందులో నాగ్ చిలిపి చేష్టలు చూసినా.. ఈ పాత్ర నాగ్ కోసమే పుట్టిందా అనిపిస్తుంది. నాగ్‌ను రొమాంటిక్ కింగ్ అని ఎందుకంటారో ఈ సినిమాతో ఈ తరం ప్రేక్షకులకు కూడా బాగా అర్థమైంది. ఈ వయసులోనూ ఏ తడబాటు లేకుండా ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్బుతంగా పండించి.. ఇప్పటికీ తాను ‘మన్మథుడే’ అని చాటుకున్నాడు నాగ్. ఆయన డైహార్డ్ ఫ్యాన్స్‌కు చాన్నాళ్ల తర్వాత విందు భోజనం లాంటి సినిమా దొరికింది. సినిమా కథలో విశేషం లేకున్నా.. కేవలం నాగ్ క్యారెక్టరే సినిమాను నడిపిస్తోంది. మొత్తానికి నాగ్ చాన్నాళ్ల తర్వాత అభిమానుల్ని అలరించే సినిమా చేసి మెప్పించాడు.