'కింగ్' అక్కినేని నాగార్జున కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ పాత్ బ్రేకర్ అనిపించుకున్నారు. స్టార్ డమ్ కోసం స్టార్ డైరెక్టర్స్ వెంట పరుగులు తీయకుండా టాలీవుడ్ కి న్యూ టాలెంట్ ని పరిచయం చేస్తూ ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అని నిరూపిస్తూ ఎలాంటి పాత్రలకైనా నేను సూట్ అవుతానని చెబుతూ ఎప్పటికప్పుడు మేకోవర్ అవుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సత్తా చాటుతున్నాడు. 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. కేవలం నాగార్జున మూలంగానే రోజు రోజుకి దిగజారిపోతున్న 'బిగ్ బాస్' షో కి రేటింగ్స్ వస్తున్నాయని టాక్ నడుస్తోంది. ఐపీఎల్ సీజన్ నడుస్తున్న సమయంలో కూడా వీకెండ్స్ లో నాగ్ వచ్చే ఎపిసోడ్స్ కి మంచి రేటింగ్స్ వస్తున్నాయంటే ఇప్పటికీ ఆయన్ని ఫ్యామిలీ ఆడియన్స్ మన్మథుడుగా ఆదరిస్తున్నారని అర్థం అవుతోంది.
ఇక సినిమాల విషయానికొస్తే నాగార్జున ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో అహిషోర్ సాల్మోన్ అనే మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు నాగ్. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ నాగార్జున కంప్లీట్ చేశాడు. ఈ చిత్రంలో ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మ పాత్రలో కనిపించనున్నాడు. గతంలో చాలాసార్లు నాగ్ ఇలా ఆర్మడ్ ఫోర్స్ ఆఫీసర్ టైపు పాత్రలు చేశాడు. అయితే అలాంటి సినిమాలన్నీ ప్లాప్స్ గా మిగిలిపోయాయి. నాగ్ నటించిన 'గగనం' సినిమా థియేటర్ లో కంటే టీవీలోనే బాగా ఆడిందనే విషయం తెలిసిందే. మరి ఇప్పుడు 'వైల్డ్ డాగ్' తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. ఏదేమైనా తోటి హీరోలందరూ ఎక్కడా తమ రేంజ్ కి తగ్గకుండా స్టార్ డమ్ కోసం ఇంకా తాపత్రయపడుతుంటే నాగార్జున మాత్రం గెస్ట్ రోల్స్ కి కూడా రెడీ అంటూ వర్సటాలిటీ చూపిస్తున్నాడని చెప్పవచ్చు.