హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు చిన్న చితకా వ్యాపారులకే కాదు.. బడా బాబులకు కూడా చిక్కులు తెచ్చిపెడుతోంది. టాలీవుడ్ బడా ఫ్యామిలీల్లో ఒక్కటైన అక్కినేని కుటుంబానికి కూడా మెట్రో రైల్ వల్ల పెద్ద దెబ్బ తగలబోతోంది. ఆ కుటుంబానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన అన్నపూర్ణ స్టూడియోలో అర ఎకరం మెట్రో రైలు కోసం వదులుకోక తప్పని పరిస్థితి నెలకొంటోంది.
జూబ్లీ హిల్స్ మీదుగా వెళ్లో మెట్రో లైను కోసం అన్నపూర్ణ స్టూడియోలోని ఏడెకరాల్లో కొంత భాగం వదులుకోవాల్సి ఉంటుందని ఇటీవలే ప్రభుత్వ అధికారులు, మెట్రో రైల్ ప్రాజెక్టు ఇంజినీర్లు ఇటీవలే అక్కినేని నాగార్జునను కలిసినట్లు సమాచారం. ఐతే ముందు ఈ ప్రతిపాదనకు ససేమిరా అన్న నాగ్.. చివరికి రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఇందుకు ఒప్పుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యక్తిగతంగా నాగార్జునను కలిసి ప్రజా ప్రయోజనార్థం స్టూడియోలో అర ఎకరం త్యాగం చేయాల్సిందేనని నచ్చ జెప్పారట.
చివరికి ఇందుకు అంగీకరించిన నాగ్.. మెట్రో ప్రాజెక్టు వల్ల తన స్టూడియో ఇంకే ఇబ్బందీ తలెత్తకూడదని.. షూటింగులకు ఆటంకాలు కలిగించకూడదని షరతు విధించారట. నాగ్ త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి ఈ అర ఎకరం ప్రభుత్వానికి అప్పగించడం గురించి.. పరిహారం గురించి మాట్లాడతారట. గత ఏడాది నాగార్జునకు చెందిన ‘ఎన్’ కన్వెన్షన్ విషయంలోనూ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవగా... తన అధీనంలో ఉన్న కొంత భూమిని వదులకోక తప్పలేదు నాగ్. ఇప్పడు ప్రైమ్ ఏరియాలో ఉన్న అన్నపూర్ణ స్టూడియోలో అర ఎకరం పోతోంది. ఇప్పటిదాకా‘అన్నపూర్ణ ఏడెకరాలు’ అనే మాట వాడేవారు. ఇకపై ఆ పేరు మార్చి.. అన్నపూర్ణ ఆరున్నర ఎకరాలు అనాలన్నమాట.