మంగళవారం పొద్దు పోయాక ఒక వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అంగరంగ వైభవంగా శ్రియ భూపాల్ తో ఎంగేజ్మెట్ చేసుకుని రెండు నెలలు కాకముందే అక్కినేని అఖిల్ ఆమె నుంచి విడిపోతున్నాడని.. వీళ్లిద్దరి పెళ్లిని రద్దు చేశారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. దీనిపై అధికారిక సమాచారం ఏమీ లేకపోయినా.. కొన్ని నేషనల్ ఇంగ్లిష్ డైలీలు పెద్ద స్థాయిలో కథనాలు ప్రచురించడంతో ఈ వార్త వాస్తవమే అనుకుంటున్నారు జనాలు.
ఇది అబద్ధమైనట్లయితే ఈపాటికే ఖండన రావాల్సింది. ఇటు అక్కినేని ఫ్యామిలీ.. అటు జీవీకే ఫ్యామిలీ ఈ రూమర్లపై సీరియస్ అయ్యుండేది. ఈ వార్త బయటికి వచ్చి ఒక రోజు దాటుతున్నా ఆ రెండు కుటుంబాల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం పెళ్లి రద్దు వార్తలకు బలం చేకూరుస్తోంది. ఈ లోపు పెళ్లి రద్దు వార్తను కన్ఫమ్ చేసేసి.. అందుకు దారి తీసిన కారణాలపై రకరకాల కథనాలు అల్లేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇక్కడ జనాల క్రియేటివిటీ చూస్తుంటే చాలామందికి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడందరూ నాగార్జున మాట కోసమే ఎదురు చూస్తున్నారు.
పెళ్లి రద్దు వార్త అబద్ధమైతే మీడియాపై నాగార్జున సీరియస్ అవుతాడనడంలో సందేహం లేదు. సినిమాలకు సంబంధించిన రూమర్లయితే లైట్ తీసుకుంటాడు కానీ.. ఇలాంటి కుటుంబ వ్యవహారాలపై రూమర్లు పుట్టిస్తే ఊరుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. ఒక వేళ పెళ్లి రద్దు వార్త నిజమే అయితే అందుకు కారణమేంటన్నది సింపుల్ గా ఒక్క మాటలో నాగ్ తేల్చేసే అవకాశముంది. మరి నాగ్ ఎప్పుడు నోరు విప్పుతాడో.. ఏమని స్పందిస్తాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/