నాగార్జున హీరోగా సోలోమన్ దర్శకత్వంలో రూపొందిన వైల్డ్ డాగ్ సినిమా ఈవారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏప్రిల్ 2న విడుదల కాబోతున్న వైల్డ్ డాగ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తాజాగా జరిగింది. సినిమా ప్రమోషన్ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ సినిమా పై ఆసక్తికలిగేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలోని ఏసీపీ విజయ్ వర్మ పాత్ర నచ్చడం వల్ల తాను చేసేందుకు ఒప్పుకున్నాను. తప్పకుండా సినిమా మరో లెవల్ లో ఉంటుందనే నమ్మకంను నాగార్జున వ్యక్తం చేశారు. తాను అనుకున్నది చేయాలనుకునే పాత్రలో విజయ్ వర్మను దర్శకుడు చూపించాడు. తన మనస్థత్వంకు దగ్గరగా ఉండటం వల్ల విజయ్ వర్మ పాత్రను చేసినట్లుగా నాగార్జున చెప్పుకొచ్చాడు.
నాకు బోర్ అనిపించిన పనులు మళ్లీ మళ్లీ చేయను. నేను ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఇది చాలా ప్రత్యేకమైనదని మాత్రం చెప్పగలను. ఈ సినిమా నిర్మాత నిజంగా వైల్డ్ డాగ్ క్షణం.. ఘాజీ వంటి విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుని నిర్మించడం నిజంగా అభినందనీయం. ఆయన ధైర్యంకు హ్యాట్సాప్ అనాల్సిందే అన్నాడు. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడ్డ తర్వాత థమన్ తో మాట్లాడి సంగీతం కావాలంటూ కోరగా అందుకు వెంటనే ముందుకు వచ్చి ఇచ్చాడు. సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడ్డారు. కష్టంకు ప్రతిఫలం దక్కుతుందని ఆశిస్తున్నాం. ఏప్రిల్ 2వ తారీకున కార్తి నటించిన సుల్తాన్ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో నాగార్జున స్పందిస్తూ ఊరిపి సినిమా తో కార్తి నాకు తమ్ముడు అయ్యాడు. తమ్ముడు కార్తి సుల్తాన్ సినిమా మరియు నా సినిమా రెండు కూడా మంచి విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను. వైల్డ్ డాగ్ కు సుల్తాన్ తెలుగు వర్షన్ గట్టి పోటీ ఇస్తుందా అనేది చూడాలి.