సరికొత్త సాహసాల ప్రయాణం మొదలైందంటూ మొన్ననే సెలవిచ్చాడు నాగార్జున. నిజానికి నాగ్ ఎప్పట్నుంచో సాహసాలు చేస్తున్నాడు. ఒకపక్క మన్మథుడిగా కనిపిస్తూనే మరోపక్క భక్తి చిత్రాలు చేశాడు. మ మ మాస్ అనిపిస్తూనే క్లాస్ కథల్లో ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు తన కొడుకులిద్దరూ హీరోలు కావడంతో తాను మరిన్ని వైవిధ్యమైన సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. అందుకే ఒక సినిమాలో తండ్రీకొడుకులుగా, మరో సినిమాలు వీల్ ఛైర్ కే పరిమితయ్యే పాత్రలోనూ నటిస్తున్నాడు. తాజాగా ఆయన మరో కీలకమైన నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది. ఈసారి ఓ నెగిటివ్ రోల్ లో కనిపిస్తాడట. అది కూడా రామ్ చరణ్ సినిమాలో అని ప్రచారం సాగుతోంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ... ఫిల్మ్ నగర్ లో మాత్రం దాని గురించే మాట్లాడుకొంటున్నారు.
రామ్ చరణ్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కతోబోతోంది. అది తమిళంలో విజయవంతమైన `తని ఒరువన్`కి రీమేక్ గా రూపొందనున్నట్టు తెలిసింది. తని ఒరువన్ లో హీరోగా జయం రవి నటిస్తే, నెగిటివ్ క్యారెక్టర్ లో అరవింద్ స్వామి నటించాడు. ఆ రోల్ ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. ఆ పాత్రను తెలుగులో నాగార్జునతో చేయించాలని సురేందర్ రెడ్డి నిర్ణయించుకొన్నట్టు సమాచారం. అందుకు చరణ్ కూడా ఓకే చెప్పేశాడట. నాగార్జునగారు ఒప్పుకొంటే నాకేం ప్రాబ్లెమ్ లేదని అన్నాడట. దీంతో నాగ్ ని కలిసి కథ కూడా వినిపించారని తెలుస్తోంది. ఒకప్పుడు అరవింద్ స్వామి కూడా కథానాయకుడే, ఆయన చేసిన పాత్ర కాబట్టి నాగార్జున కూడా నటించేందుకు ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద నవతరం కథానాయకులకి మల్టీస్టారర్ ట్రెండ్ బాగానే పనికొస్తోంది.