రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ రీమేక్ సినిమా తని ఒరువన్ లో విలన్ పాత్ర ఎవరు పోషిస్తారన్నది కొన్ని నెలల నుంచి పెద్ద రచ్చ అయిపోయింది. మాతృక విలన్ అరవింద్ స్వామిని అడిగారు గానీ ఆయన ఒప్పుకోలేదు. తర్వాత మాధవన్ వెంట పడ్డారు గానీ ఆయన నటించట్లేదని మొన్న ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. రానా - నారా రోహిత్ - రాజశేఖర్ - జగపతి బాబుల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయిగానీ ఎవరు ఫైనెల్ కాలేదు. అయితే తాజాగా ఆ రోల్ కోసం టీమ్ కింగ్ నాగార్జునను సంప్రదించారట. క్యారెక్టర్ బాగుండటంతో ఆయన కూడా పాజిటివ్ గానీ స్పందించారని చెర్రీ అత్యంత సన్నిహితుల ద్వారా తెలిసింది.
దాదాపు నాగ్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీమ్ బలంగా నమ్ముతోంది. ఇదే గనుక సుసాధ్యమైతే నాగ్ నుంచి మరో కొత్త కోణం ఆశించవచ్చు. అయితే ఈ విషయాలన్ని అధికారికంగా వెల్లడైతే గానీ ఏ విషయం కన్పమ్ కాదు. ఇప్పటికే స్ర్కిప్ట్ సిద్ధమైపోయింది. డిసెంబర్ నుంచి సెట్స్ కు వెళ్లాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. డి..వి.వి. దానయ్య 5 కోట్లు చెల్లించి రీమేక్ హక్కులను దక్కించుకున్నారు.