కింగ్ నాగార్జునకు ఈ ఏడాది కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా నిలిచింది. ఏడాది ఆరంభంలో వచ్చిన బంగార్రాజు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కానీ ది ఘోస్ట్ సినిమా మాత్రం నిరాశ పర్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఘోస్ట్ సినిమాకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ కంటెంట్ విషయంలో తెలుగు ప్రేక్షకులను ది ఘోస్ట్ నిరాశ పర్చాడు.
నాగార్జున ఈ మధ్య కాలంలో ఒక్క సక్సెస్ వస్తే రెండు మూడు ఫ్లాప్స్ పడుతున్నాయి. అందుకే కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్త అవసరం అన్నట్లుగా భావిస్తున్నారట. అందులో భాగంగానే ది ఘోస్ట్ సినిమా తర్వాత నాగార్జున మోహన్ రాజా దర్శకత్వంలో ఒక సినిమాను చేయాల్సి ఉన్నా కూడా ప్రస్తుతానికి ఆ సినిమాను పక్కకు పెట్టారట.
గాడ్ ఫాదర్ సినిమా తో కమర్షియల్ గా మోహన్ రాజా బిగ్ సక్సెస్ ను దక్కించుకోవడం లో విఫలం అయ్యాడు. అందుకే నాగార్జున ఆలోచనల్లో పడ్డాడు అనేది సమాచారం. గత కొన్ని రోజులుగా రచయిత ప్రసన్న కుమార్ దర్శకత్వంలో నాగార్జున సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇటీవల విడుదల అయిన ధమాకా సినిమాకు ప్రసన్న కుమార్ రచయిత. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా ఆలస్యం లేకుండా నాగార్జున తన తదుపరి సినిమా ను రైటర్ ప్రసన్న కుమార్ తో చేయాలని నిర్ణయించుకున్నాడు. దర్శకుడిగా ప్రసన్న కుమార్ కు ఇదే మొదటి సినిమా అవ్వబోతుంది.
గతంలో నాగార్జున చాలా మంది కొత్త దర్శకులతో సినిమాలు చేయడం జరిగింది. అందులో ఎక్కువ శాతం భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుక ఆ సెంటిమెంట్ కలిసి వచ్చి ప్రసన్న కుమార్ తో చేయబోతున్న సినిమా నాగ్ కు హిట్ ను అందిస్తుందేమో చూడాలి.
ఇక నాగార్జున.. ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమా కథ లో ఒక కీలకమైన పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కథకు చాలా ముఖ్యం అవ్వడం వల్ల యంగ్ హీరోను నటింపజేయాలని ప్రసన్న కుమార్ భావించాడట. అందుకే ఆ పాత్రకు గాను అల్లరి నరేష్ ను సంప్రదించడం.. ఆయన ఓకే చెప్పడం.. నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట.
మొత్తానికి నాగార్జున తదుపరి సినిమా ప్రసన్న కుమార్ దర్శకత్వంలో అని అలాగే ఆ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని విశ్వసనీయంగా వార్తలు వస్తున్నాయి. ఇవే విషయాలు ఒకటి రెండు వారాలు లేదా ఆలోపే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.