అఖిల్ అక్కినేని కొత్త సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు సినిమాలతో విజయం దక్కకపోవడంతో చినబాబుకు విజయం అందించే బాధ్యతను అల్లు అరవింద్ తీసుకున్నారట. డైరెక్టర్ 'బొమ్మరిల్లు' భాస్కర్ ఫామ్ లో లేనప్పటికీ మంచి స్క్రిప్ట్ ను రెడీ చేయడంతో ఈ సినిమాకు అఖిల్ కోసం సెట్ చేశారట. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ సినిమాకు అరవింద్ గారు రూ. 20 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించారని.. అన్ని విషయాల్లో పొదుపు చర్యలు పాటించాలని డిసైడ్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఈ బడ్జెట్ తో సినిమాకు రిచ్ ఫీల్ రాదనే ఉద్దేశంతో నాగార్జున అదనంగా ఎంత బడ్జెట్ అవుతుందో అదంతా తను ఇచ్చేందుకు రెడీ అయ్యారని అన్నారు. అయితే గీతా ఆర్ట్స్ వర్గాలు మాత్రం ఇవన్నీ గాసిప్స్ మాత్రమే అని తేల్చేస్తున్నారు.
సినిమా కథకు అవసరమైనంత బడ్జెట్ మాత్రమే ఖర్చుపెడుతున్నారని అంటున్నారు. అఖిల్ సినిమాలకు మంచి కలెక్షన్సే వచ్చినా కాస్ట్ ఫెయిల్యూర్లుగా నిలిచాయి. అందుకే మీడియం రేంజ్ బడ్జెట్ అయితే సినిమా కలెక్షన్స్ విషయంలో ప్రెజర్ కూడా ఉండదనే ఉద్దేశంతో బడ్జెట్ పెంచడం లేదని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్ విషయంలో నాగార్జున అసలు ఇన్వాల్వ్ కావడం లేదట. అరవింద్ గారిపై నమ్మకంతో రిలాక్స్డ్ గా ఉన్నారట.