వేసవి సందడికి ఇంకా చాలా సమయం ఉంది కానీ.. ఈ లోపే రెండు నెలల పాటు ప్రతి వారానికీ బెర్తులు బుక్కయిపోయాయి. మార్చి 29న రంగస్థలం’తో మొదలుపెడితే.. మే నెలాఖరు వరకు ఏ వీకెండ్ కూడా ఖాళీ లేదు. మే నెలలో లెక్కకు మిక్కిలిగా సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. తొలి వారం ‘నా పేరు సూర్య’ వస్తుంటే.. రెండో వారానికి ‘సాక్ష్యం’ షెడ్యూల్ అయి ఉంది. తర్వాతి వీకెండ్లో ‘పంతం’.. ‘ట్యాక్సీవాలా’ సినిమాలున్నాయి. చివరి వారానికి ‘సవ్యసాచి’ సినిమాను అనుకున్నారు. కానీ ఇప్పుడేమో నాగార్జున సినిమా ‘ఆఫీసర్’ను మే 25న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
నాగచైతన్య-చందూ మొండేటిల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సవ్యసాచి’పై మంచి అంచనాలున్నాయి. ఇలాంటి సినిమాను వేసవికే విడుదల చేస్తే మంచి ఫలితం ఉంటుందని భావించింది చిత్ర బృందం. షూటింగ్ పూర్తి కావడం.. ఖాళీ దొరకడం.. అన్నీ చూసుకుని మే చివరి వారానికి షెడ్యూల్ చేసి పెట్టుకుంటే.. ఇప్పుడేమో కొడుకు సినిమాకు తండ్రే అడ్డం పడుతున్నాడు. ఇది కమ్యూనికేషన్ తోనే జరిగిందా లేక వీళ్ల పాటికి వీళ్లు డేట్ ఇచ్చేశారా అన్నది తెలియడం లేదు. మే చివరి వారాంతాన్ని వదిలేస్తే ‘సవ్యసాచి’కి అడ్వాంటేజీ పోతుంది. నాగ్ సినిమా ఉంది కాబట్టి ముందు వారం.. తర్వాతి వారం రిలీజ్ కుదరదు. ఈ పరిస్థితిలో వేసవిని విడిచిపెట్టి జూన్‌కు సినిమాను వాయిదా వేసుకోక తప్పదేమో.