తెలుగులో కొత్త టాలెంట్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కర్చీఫ్ వేసేస్తాడని అక్కినేని నాగార్జునకు పేరుంది. ఒక దర్శకుడి టాలెంట్ ఏంటో చాలా త్వరగా గుర్తించి అతడిని తమ సంస్థకు కమిట్ చేయడం నాగార్జునకు అలవాటు. ఇలా ఎంతోమంది యువ దర్శకులకు అవకాశాలిచ్చాడు నాగ్. ఇంతకుముందు తన గురించి మాత్రమే ఆలోచించే నాగార్జున.. గత కొన్నేళ్లుగా తన కొడుకుల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాడు. చందూ మొండేటి.. సుధీర్ వర్మ లాంటి యువ దర్శకుల్ని చైతూ కోసం కమిట్ చేయించింది నాగార్జునే. ‘తొలి ప్రేమ’తో సత్తా చాటుకున్న వెంకీ అట్లూరితో అఖిల్ ప్రాజెక్టును సెట్ చేయించాడు నాగ్. ఇక తన పెద్ద కొడుకు నాగచైతన్య.. సరైన కమర్షియల్ ఎంటర్టైనర్లు చేయట్లేదని మారుతితో ‘శైలజారెడ్డి అల్లుడు’ ఓకే చేశాడు.
నిజానికి మారుతిపై నాగ్ కన్ను ముందే పడింది. అతడితో అఖిల్ రెండో సినిమాను డైరెక్ట్ చేయించాలని చూశాడు నాగ్. కానీ కుదరలేదు. ఐతే ‘శైలజారెడ్డి అల్లుడు’ తర్వాత మాత్రం మారుతి-అఖిల్ కాంబినేషన్లో కచ్చితంగా సినిమా చేయించాలని అనుకున్నాడు నాగ్. వచ్చే ఏడాది ఈ సినిమా చేసేలా మారుతితో కమిట్మెంట్ కూడా తీసుకున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తే ‘శైలజారెడ్డి అల్లుడు’ అంచనాల్ని అందుకోలేకపోయింది. మారుతి టచ్ కోల్పోయినట్లుగా అనిపించింది ఈ సినిమా చూస్తే. మారుతి రచనతో వచ్చిన ‘బ్రాండ్ బాబు’ సైతం తేడా కొట్టేసింది. కొన్ని రోజుల కిందట ‘చి ల సౌ’ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మారుతిని తెగ పొగిడేశాడు నాగ్. అతడికి ప్రేక్షకుల నాడి బాగా తెలుసని.. బాగా ఎంటర్టైన్ చేస్తాడని అన్నాడు. కానీ మారుతి నాగ్ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు. ఈ పరిస్థితుల్లో మరి అఖిల్ తో మారుతి సినిమా ఉంటుందా లేదా అన్న సందేహాలు మొదలయ్యాయి. నాగ్ మాట నిలబెట్టుకుంటాడా.. వెనక్కి తగ్గుతాడా అన్నది ఆసక్తికరం.