నాగ్ సవాల్ ఎందుకు చేస్తున్నట్టు

Update: 2019-06-14 04:34 GMT
ఊహించినట్టే కింగ్ నాగార్జున మన్మథుడు 2 రిలీజ్ విషయంలో పెద్ద రిస్క్ కు రెడీ అయ్యారు. ఆగస్ట్ 9 విడుదల చేస్తారనే లీక్ నాలుగైదు రోజులు క్రితమే వచ్చినప్పటికీ అనౌన్స్ చేసే దాకా ఏదీ నమ్మలేం కాబట్టి అభిమానులు కూడా క్లారిటీ కోసం వేచి చూసారు. నిన్న టీజర్ లో ఆగస్ట్ 9 డేట్ ని అధికారికంగా లాక్ చేశారు. వీడియో చివర్లో దాన్ని స్పష్టంగా హై లైట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కారణం దానికి కేవలం ఆరు రోజుల వ్యవధిలో టాలీవుడ్ విజువల్ వండర్ సాహో రానుండటమే.

ఒక్క వారం పూర్తి కాకుండానే థియేటర్ల మీద దాడి చేయడానికి ప్రభాస్ వస్తున్నప్పుడు రిస్క్ తీసుకుని మరీ నాగ్ తన సినిమాను ఎందుకు వదులుతున్నాడు అనే అనుమానం సర్వత్రా రేగుతోంది. పైగా సాహో టీజర్ వచ్చాక అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక్కడ నాగ్ స్ట్రాటజీ గమనిస్తే సాహోతో సై అంటే సై అనే యుద్ధానికి సిద్ధపడినట్టే తెలుస్తోంది. టీజర్ కూడా ఒకే తేదీకి విడుదల చేయడంలో ఆంతర్యం అదేనేమో.

టాక్ బాగా వస్తే ఎంత తక్కువ గ్యాప్ ఉన్నా నాగ్ థియేటర్లు అంత ఈజీగా ఖాళీ కావు. కాకపోతే కౌంట్ ఖచ్చితంగా తగ్గుతుంది. మొదటి రెండు రోజులు ఎక్కడ చూసినా సాహో ఫీవర్ ఉంటుంది కాబట్టి సహజంగానే ఎగ్జిబిటర్లు దాన్ని వేసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఆలోపే మన్మథుడు 2 అద్భుతంగా ఉంది అనే టాక్ వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదూ సాహోనే బాహుబలి రేంజ్ లో రెస్పాన్స్ దక్కించుకుంటే మన్మథుడు 2 వసూళ్లకు దెబ్బ పడటం ఖాయం. క్యాలికులేషన్స్ లో తలపండిన నాగ్ ఇవన్నీ అలోచించి ఉండరని చెప్పలేం. కాకపోతే సాహోతో టఫ్ ఫైట్ కి సిద్ధపడటం కంటెంట్ మీద నమ్మకమేనా లేక ఇంకేమైనా ఉందా అనేది మాత్రం సస్పెన్స్.
Tags:    

Similar News