నాగార్జున.. వర్మ ట్రాప్‌ లో పడిపోయాడా?

Update: 2018-03-10 08:23 GMT
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున సినిమా అనగానే ఆసక్తి కంటే ఆశ్చర్యమే ఎక్కువ కలిగింది జనాల్లో. గత పదేళ్లలో వర్మ ట్రాక్ రికార్డు చూసి నాగార్జున లాంటి హీరో అతడితో సినిమా చేయడానికి ముందుకు రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. చాలా మంది వారించినా నాగ్ ఈ సినిమా చేయడానికే మొగ్గు చూపినట్లుగా వార్తలొచ్చాయి. నాగ్ అంత బలంగా నమ్మాడంటే వర్మ కథలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని కొందరు సమాధాన పడ్డారు. కానీ మెజారిటీ జనాల్లో ‘ఆఫీసర్’ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. ఐతే సినిమాకు హైప్ తేవడం కోసం ఈ చిత్ర బృందం రిలీజ్ చేస్తున్న ఆన్ లొకేషన్ పిక్స్ సినిమాకు ప్రతికూలంగానే మారుతున్నాయనే అభిప్రాయం జనాల్లో కలుగుతున్నాయి.

నాగార్జున విలన్లను రఫ్ఫాడిస్తున్న రెండు మూడు ఫొటోలు సోషల్ మీడియాలోకి వదలగా.. అవి నెగెటివ్ ఫీడ్ బ్యాకే తెచ్చుకున్నాయి. నాగ్ చాలా టైర్డ్ గా కనిపిస్తున్నాడని.. ఆ ఫొటోల్లో పవర్ కనిపించం లేదని కామెంట్లు పడ్డాయి. కానీ వర్మ మాత్రం ఆ దృశ్యాల గురించి తెగ పొగిడేస్తూ ట్వీట్లు పెట్టాడు. తాజాగా హీరోయిన్ తో కలిసి ఉన్న కొన్ని ఫొటోల్ని నాగ్ స్వయంగా రిలీజ్ చేశాడు. అవి చూస్తే ఏదో సెకండ్ గ్రేడ్ సినిమాను తలపిస్తున్నాయి. నాగ్.. వర్మ ట్రాప్ లో పడిపోయి తన స్థాయికి తగని సినిమా చేస్తున్నాడనే భావన కలిగిస్తున్నాయి. రాను రాను ఈ సినిమా మీద నాగ్ అభిమానులకు నమ్మకం తగ్గిపోతోంది. సినిమా రిలీజయ్యాక నాగ్ రిగ్రెట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న భయం కలిగిస్తోంది ‘ఆఫీసర్’. మరి మే 25న ఏం జరుగుతుందో చూద్దాం.

Tags:    

Similar News