డైరెక్టర్లు ఎక్కడున్నారు? అంటున్న నాగ్

Update: 2017-07-07 04:30 GMT
తెలుగులో ఇప్పుడు ఒక చిక్కు ప్రశ్న ఏర్పడింది. మంచి కథలు లేవు మంచి డైరెక్టర్లు లేరు అందుకే మేము సినిమాలు తక్కువ తీస్తున్నాం అంటున్నారు సీనియర్ హీరోలు. ఇప్పుడు వచ్చిన కొత్తవాళ్లు ఎవరూ అంత మంచి కథలతో రావటంలేదు అందుకే కొత్తరకం సినిమాలు మనం చూడలేకపోతున్నాం అంటున్నారు. అయితే మన తెలుగులో ఒక సూపర్ స్టార్  హీరోకి కొత్త వారిని ప్రోత్సహించి అవకాశం ఇచ్చే చరిత్ర ఉంది. అదెవరు అంటూ టక్కున గుర్తొచ్చే పేరు.. అక్కినేని నాగార్జుననే.

నాగార్జున ఈ మధ్య డబుల్ స్టాండర్డ్ గా  ఒక మాటన్నాడు. ఒక పేరున్న ఫిల్మ్ డైరెక్టర్ తో చిన్న చిట్ చాట్ లో నాగార్జునను ఒక ప్రశ్న అడిగారు. “సర్, మీరు ఎందుకు ఈ మధ్య చాలా  తక్కువ సినిమాలు చేస్తున్నారు అని అడిగారు?”. దానికి నాగ్ తన అనుభవాన్ని జత చేసి “ఎక్కడ సర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు టాలెంటెడ్ డైరెక్టర్స్? పెద్ద డైరెక్టర్లు బాగా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఉన్న కొత్తవాళ్ళు పాత కథనే అటు ఇటు మార్చి అవే కథలు రాస్తున్నారు. అందుకే కొత్త వాళ్ళ కథలు వినడానికి కూడా ఇబ్బందిగా ఉంది” అని చెప్పాడట నాగ్. ఇదే విషయాన్ని మరోసారి ట్విట్టర్లో అడిగితే మాత్రం.. నాగ్ ఇంకోలా స్పందించాడు. “బయట కావలిసినంత టాలెంట్ ఉంది. వాళ్ళకి కావలిసింది ఒక వారధి మాత్రమే. వాళ్ళని జస్ట్ మనం వెతికి పట్టుకోవాలంతే'' అంటున్నాడు.

ఏదేమైనా నాగార్జున అంతా సులువుగా ఒక ప్రాజెక్టు కు ఒకే చెప్పట్లేదు. భాయ్ వంటి సినిమాతో తగిలిన దెబ్బలతో ఎంతో బిజినెస్ మైండ్ పెట్టి ఆలోచించి చేద్దాం అంటున్నాడు. మరి అలాంటివాడికి డైరెక్టర్లు దొరకడం కొంచెం కస్టమే. ప్రస్తుతానికి నాగ్ రాజు గారి గది 2  సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయడంపై ఫోకస్ చేస్తున్నాడు.
Tags:    

Similar News