అఖిల్‌‌ ను చూసి నేర్చుకోవాలంటున్న నాగ్

Update: 2017-02-01 10:32 GMT
తన చిన్న కొడుకు అఖిల్ తనకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని చెప్పాడు అక్కినేని నాగార్జున. తొలి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ రెండో సినిమాకు హైప్ తెచ్చుకోవడం అతడికే చెల్లిందని.. విక్రమ్ డైరెక్షన్లో అఖిల్ చేయబోయే సినిమాకు ఆల్రెడీ బజ్ క్రియేటైందని.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని నాగ్ అన్నాడు. అఖిల్ రెండో సినిమా విశేషాల గురించి నాగ్ ఇంకా ఏమన్నాడంటే..

‘‘అఖిల్ తొలి సినిమా హిట్టయి ఉంటే బాగుండేది. రెండో సినిమాపై అంచనాలు భారీగా ఉండేవి. ఐతే ‘అఖిల్’ సినిమా ఫ్లాపైనా సరే.. రెండో సినిమాపై బాగానే హైప్ వస్తోంది. తన రెండో సినిమాపై  బజ్ తీసుకురావడంలో అఖిల్ తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నాడు. అతణ్ని చూసి నేను నేర్చుకోవాలనిపిస్తుంది. ఆ విషయమే అతడితో అంటుంటా’’ అని నాగ్ చెప్పాడు. అఖిల్ రెండో సినిమా ఆలస్యమవుతోందని అభిమానులు ఫీలవ్వాల్సిన పని లేదని.. ఆ సినిమా ప్రత్యేకంగా ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని నాగ్ అన్నాడు. ‘‘ఈ సినిమాను మొదలుపెట్టడం ఆలస్యమవుతున్న మాట వాస్తవమే. కానీ మంచి సినిమాతో రావాలనే టైం తీసుకుంటున్నాం. నిజానికి విక్రమ్ మొదట చెప్పిన కథ ఓకే అయి ఉంటే ఈపాటి సినిమా షూటింగ్ జరుగుతుండేది. ఐతే ఆ సినిమా ఫస్టాఫ్ చాలా బాగా అనిపించింది. అక్కడి నుంచి కథ ముందుకు కదల్లేదు. రెండో అర్ధం విషయంలో నేను కొన్ని డౌట్లు అడిగాను. నాకే ఇలా సందేహాలు వస్తే రేప్పొద్దున ప్రేక్షకులు కూడా అలాగే ఫీలవుతారని భావించి.. విక్రమ్ ఆ కథను పక్కన పెట్టేశాడు. ఇంకో కొత్త కథతో వచ్చాడు. ఆ కథ విని చాలా థ్రిల్ ఫీలయ్యా. అది చాలా కొత్తగా ఉంటుంది. అలాంటి కథతో సినిమా చేయడం రిస్కే. కానీ ఇప్పటి తరానికి అలాంటి కొత్త కథలే కావాలి. ఈ సినిమా స్క్రిప్టు దాదాపు పూర్తి కావచ్చింది. పూర్తి సంతృప్తికరంగా అనిపించాకే సినిమా మొదలుపెడతాం’’ అన్నాడు నాగ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News