మన దగ్గర కాదు కానీ... ఇతర భాషల్లో మాత్రం సీక్వెల్ సినిమాకి భలే క్రేజ్. మీరు తీసేస్తే మేం చూస్తాం అన్నట్టుగా ఆ సినిమాకి అప్పటికే రెడీగా ఆడియెన్స్ ఉంటారన్నమాట. తొలి భాగం చూసినవాళ్లంతా సీక్వెల్ చూడ్డానికి ఆసక్తి చూపుతారనే నమ్మకం మేకర్స్ లో ఉంటుంది. అందుకే సీక్వెల్ కి ఏమాత్రం స్కోపున్నా బండిని పట్టాలెక్కిస్తారు. అయితే తెలుగులో మాత్రం ఆ పరిస్థితి లేదు. సీక్వెల్ సినిమాల విషయంలో తెలుగులో సక్సెస్ రేటు జీరో అని చెప్పొచ్చు. ఒకట్రెండు ఆడాయి కానీ... అవి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో మాత్రం కాదు. అందుకే ఆ విషయంలోనే నాగ్ ఇప్పుడు భయపడుతున్నాడట. ఇటీవల సూపర్ సక్సెస్ అయిన సోగ్గాడే చిన్ని నాయనాకి సీక్వెల్ తీయాలనే ఆలోచనలో నాగ్ ఉన్నాడన్న విషయం తెలిసిందే. సోగ్గాడే సినిమాలో చేసిన బంగార్రాజు పాత్రతో సీక్వెల్ చేయాలనేది నాగ్ ఆలోచన.
నిజానికి నాగార్జునకి సీక్వెల్ అంటే ఇష్టం లేదు. కానీ దర్శకుడు ఇస్తున్న భరోసాతో ఓకే చెప్పి బంగార్రాజు టైటిల్ రిజిస్టర్ చేయించాడు. అయితే కథ షేప్ అప్ అయ్యే విధానాన్ని చూసే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట నాగ్. రకరకాల ఐడియాలతో కథని సిద్ధం చేయిస్తున్నాడట. ఇటీవల ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున బంగార్రాజు గురించి తన మనసులో మాటని స్పష్టంగా బయటపెట్టాడు. ``ఆ సినిమా ఎప్పుడు మొదలుపెడతామో మాకే తెలియదు. అసలే మనకు సీక్వెల్ విషయంలో సక్సెస్ రేటు చాలా తక్కువ. అందుకే కథ పక్కా అనుకున్నాకే ముందుకెళతాం. సోగ్గాడే హిట్టయింది కాబట్టి సీక్వెల్ వెంటనే మొదలుపెట్టాలనే తొందరేమీ లేదు. ఏ విషయంలోనూ నేను తొందరపడను`` అని చెప్పుకొచ్చాడు నాగార్జున. త్వరలోనే ఆయన కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నమో వెంకటేశలో నటించబోతున్నాడు.