ఊపిరి ఎప్పుడైనా తీసుకోవాల్సిందే కానీ.. ఇక్కడ చెప్పేది నాగ్ ఊపిరి రిలీజ్ కి సంబంధించిన విషయాన్ని. సోగ్గాడి హిట్ తో మంచి ఊపు మీదున్నాడదు అక్కినేని నాగార్జున. చాలా కాలం తర్వాత మళ్లీ రొమాంటిక్ నాగ్ దర్శనమివ్వడంతో.. ఫ్యాన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ కావడంతో.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ని కూడా లైన్ లో పెట్టేశాడు నాగార్జున.
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ కార్తితో కలిసి నాగ్ ఒక మల్టీ స్టారర్ చేస్తున్నాడు. ఇది దాదాపుగా షూటింగ్ కంప్లీట్ అయిపోయిన మూవీనే. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి, ఒకటి అరా ప్యాచ్ వర్కులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటన్నిటినీ కంప్లీట్ చేసేసి, మార్చ్ 25న ఊపిరిని రిలీజ్ చేయాలని నాగ్ డిసైడ్ అయ్యాడు. నిజానికి ఫిబ్రవరిలోనే ఊపిరిని విడుదల చేయాలని ముందు భావించినా.. సమ్మర్ సీజన్ ప్రారంభం నాటికి మూవీ థియేటర్లలో ఉండాలని భావించడంతో... ఇలా మార్చ్ 25 డేట్ ని ఫిక్స్ అవాల్సి వచ్చింది. ప్రసాద్ వి పొట్లూరి ఈ మూవీని నిర్మిస్తుండగా.. తమన్నా హీరోయిన్ గా చేస్తోంది.
అడవి శేష్, అనుష్క లు కేమియో రోల్స్ చేస్తుండడం విశేషం. ఈ మూవీ మొత్తంలో నాగ్ కుర్చీకి అతుక్కుపోయి ఉండే పాత్రనే పోషిస్తుండడం విశేషం. మళయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఊపిరికి.. ఫ్రెంచ్ సినిమా ది ఇన్ టచబుల్స్ ఆధారంగా రాసుకున్న స్టోరీ.